
వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరచడానికి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అందుకనే వేప ఒక ఔషధ మూలిక.. దీని ఆకులు చేదుగా ఉన్నా.. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు తింటే చాలా వ్యాధులను నయం చేయగలదు. ఆయుర్వేదంలో వేపను శక్తివంతమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. దీనిని ఆరోగ్యవర్ధిని, సర్వ రోగ నాశిని అని అంటారు. వేప ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలోని మూడు దోషాలు సమతుల్యం అవుతాయి. వాత, పిత్త, కఫ దోషాల నివారణకు ప్రభావంతంగా పని చేస్తుంది. ఈ రోజు ప్రతిరోజూ వేప ఆకుల నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

ఉబ్బరం నియంత్రణ: ఆయుర్వేదంలో వేపను అగ్ని ఉద్దీపనగా చెబుతారు. అంటే ఇది జీర్ణక్రియను పెంచుతుంది. వేప జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. జీర్ణవ్యవస్థను సమతుల్యం చేస్తుంది. ప్రతిరోజూ వేప ఆకు నీటిని తీసుకోవడం వల్ల సరైన జీర్ణక్రియ జరుగుతుంది. ఉబ్బరం నియంత్రణ అవుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో వేప ఆకులను నీటిలో మరిగించి తాగడం వల్ల కడుపు నొప్పులు, మలబద్ధకం, పేగు మంట వంటి సమస్యలు నియంత్రించబడతాయి. ఈ నీరు పేగు పురుగులను బయటకు పంపి.. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నోటి ఆరోగ్యం: వేప ఆకు నీటిని మౌత్ వాష్ గా ఉపయోగించడం వల్ల దంతాలపై ఫలకం ఏర్పడటం తగ్గుతుంది. ఇది చిగుళ్ల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. నోటిని, దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా వేప నీటిని ఉపయోగించడం వల్ల నోరు ఆరోగ్యంగా ఉంటుంది. దంతాలు శుభ్రంగా ఉంటాయి.

మధుమేహం నియంత్రణ: క్రమం తప్పకుండా వేప నీరు త్రాగడం వలన టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. జీవక్రియను మెరుగుపరచడంలో కూడా వేప ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వేప నీరు తాగడం వలన వేప ఆకుల్లో ఉన్న సహజ సమ్మేళనాలు శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి, గ్లూకోజ్ తగినంత మొత్తంలో కణాలకు చేరేలా చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులను నివారిస్తుంది.

కాలేయ ఆరోగ్యానికి: వేప నీరు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని యాంటీఆక్సిడెంట్, ఔషధ గుణాలు శరీరంలోని విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి. కాలేయంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. వేప నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన కాలేయాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.

చర్మ సమస్యలు దూరం: వేప నీటిలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలు, గజ్జి, తామర, చర్మపు మంటలను తగ్గించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా వేప నేరు తీసుకోవడం వల్ల అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.

అంతేకాదు వేప ఆకుల నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు సమస్యలు తగ్గుతాయి. ఈ నీటిని తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. వేప నీరు రక్తాన్ని శుద్ధి చేస్తుంది..శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.

వేప నీరు త్రాగడానికి ఉత్తమ సమయం.. ఉదయం వేప నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల కలిగే అదనపు ప్రయోజనాలను పొందడానికి అనువైన సమయం. ఖాళీ కడుపుతో పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహిస్తుంది. ప్రతిరోజూ వేప నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను పెంచుతుంది.