
పెరుగుతో పాటు ఆమ్ల గుణాలున్న ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా నిమ్మజాతి పండ్లు, టొమాటో, ప్రాసెస్డ్ ఫుడ్స్, మసాలున్న ఆహరంతో పెరుగుని కలిపి తింటే పొట్టలో పీహెచ్ స్థాయులు అదుపు తప్పుతాయి. దీంతో అజీర్తి, పొట్టలో ఆమ్లత్వం పెరిగి అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆరోగ్య పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. .

నాన్ వెజ్ తో పెరుగుని కలిపి తినవద్దు. చికెన్, మటన్.. వంటి మాంసాహారంతో పాటు చేపల కూర తిన్న తర్వాత పెరుగుని తినవద్దు అని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ఈ రెండింటినీ ఒకేసారి తినడం వలన ఆహారం జీర్ణం అవదు. దీంతో కడుపు పట్టేసినట్లు అన్పించడమే కాదు కడుపు నొప్పితో ఇబ్బంది పడే చాన్స్ ఉందట. కనుక పొట్ట సంబంధిత సమస్యల్ని తెచ్చిపెట్టే పెరుగు మాంసాహార పదార్ధాలను తీసుకోవడం మానివేస్తే ఆరోగ్యానికి మంచిది.

వేసవిలో మాత్రమే కాదు అన్ని సీజన్స్ లోనూ రకరకాల సలాడ్స్ ను తీసుకుంటారు. అయితే కొంతమంది పెరుగు చిలికి క్రీమ్ అయ్యాక సలాడ్స్ ని గార్నిష్ చేయడానికి ఉపయోగిస్తారు. సలాడ్ లో కొన్ని రకాల పండ్లు ఉంటే పెరుగుని ఏ రూపంలో వాడినా అది మంచిది కాదని చెబుతున్నారు. ముఖ్యంగా మామిడి పండు, పనస తొనలు, ఆప్రికాట్ వంటి పండ్లు సలాడ్ లో ఉండే పెరుగుని ఉపయోగించవద్దు. ఈ పండ్లు శరీరంలో వేడి పుట్టించే స్వభావం కలిగి ఉంటే.. పెరుగులో చలువ చేసే గుణం ఉంటుంది. కనుక ఈ రెండింటినీ కలిపి ఏకకాలంలో తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అప్పుడు శరీరంలో టాక్సిన్లు విడుదల అవుతాయి. అంతేకాదు స్కిన్ పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెరుగుతో పాటు వంకాయ సంబంధించిన ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. వంకాయల్లో ఉండే టానిన్ పెరుగుతో కలిస్తే జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.శరీరం గ్రహించే పోషకాల పై ఈ కాంబినేషన్ ప్రతికూల ప్రభావం చూపిస్తుందట.

ఆకుకూరల్ని పెరుగుతో కలిపి తీసుకుంటే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరల్లోని ఆక్సలేట్స్, పెరుగులోని క్యాల్షియ లోపం ఏర్పడేలా చేస్తాయి.

పెరుగుతో పాటు ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉండే పచ్చళ్లు, పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో ప్రొబయోటిక్ స్థాయి పెరిగిపోతుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెరుగు అన్నంలో కొంతమంది నూనె పదార్ధలైన వేపుళ్లు, చిప్స్ వంటి వాటిని కలిపి తింటారు. ఇలా చేయడం వలన ఒకొక్కసారి జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఏర్పడతాయట. వీటిని తిన్న తర్వాత కొందరు కడుపుబ్బరం, కడుపునొప్పి, అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం జీర్ణక్రియను నెమ్మదించేలా ఈ కాంబినేషన్ చేస్తుందని చెబుతున్నారు.