Health Tips: వ‌ర్షాకాలంలో వీటి జోలికి అస్సలు వెళ్లకండి.. లేదంటే తిప్పలు తప్ప‌వు!.. ఎందుకో తెలుసా?

Updated on: Sep 07, 2025 | 6:06 PM

వర్షాకాలం వచ్చిందంటే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు. వర్షాకాలంలో మన రోగనిరోదక శక్తి బలహీనంగా ఉండడం కారణంగా ఈ వ్యాధులు తరచూ మనల్ని ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి.ఈ సందర్భంలో మనం ఆరోగ్యంగా ఉండేందుకు మన ఆహరంలోకి కొన్ని పండ్లను తీసుకుంటూ ఉంటాం. అయితే వర్షా కాలంలో ఏ పండ్లను తినడం ఆరోగ్యకరం.. అసలు వర్షా కాలంలో తినకూడని పండ్లు ఏవి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

1 / 6
పుచ్చ‌కాయ : వర్షాకాలంలో మీకు పుచ్చకాయ తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఎందకంటే పుచ్చకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో దీన్ని తినడం వల్ల కడుపులో గ్యాస్, ఇతర సమస్యలు రావచ్చు. అదే కాకుండా వర్షాకాలంలో పుచ్చకాయ ఎక్కువ సమయం నిల్వ ఉండలేదు. ఇది త్వరగా చెడిపోతుంది. కాబట్టి వర్షాకాలంలో పుచ్చకాయను తినడం మంచిది కాదని వైద్యు నిపుణులు చెబుతున్నారు.

2 / 6
స్ట్రాబెర్రీలు : వర్షా కాలంలో స్ట్రాబెర్రీలకు కూడా దూరంగా ఉండమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని వర్షాకాలంలో తినడం వల్ల జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులు  వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి వర్షాకాలంలో వీటిని కొంచెం అవైడ్ చేయడమే బెటర్.

3 / 6
ద్రాక్ష: ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే పదార్ధం ఉంటుంది. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. ఇది ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. యవ్వనంగా కనిపించే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.

4 / 6
పీచ్ : వర్షా కాలంలో పీచు పండ్లను తినడం కూడా మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వర్షాకాలంలో తేమ, బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. పండ్లు తడిగా ఉండటం వల్ల వాటిపై శిలీంధ్రాలు లేదా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది, ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఈ క్ర‌మంలో ఈ పండ్ల‌ను తింటే ఇన్ఫెక్ష‌న్స్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది.

5 / 6
ఏ పండు తినాలి?: వర్షా కాలంలో మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీరు ఆపిల్, నేరేడు పండ్ల‌ను తినొచ్చు. ఈ సీజన్‌లో ఆపిల్ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాపిల్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

6 / 6
అలాగే నేరేడు పండ్ల‌ను కూడా తిన‌ండి. ఇవి తినడం వ‌ల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెరుగుతుంది. వర్షాకాలంలో దానిమ్మ కూడా మంచి ఎంపిక. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటివి రాకుండా చేస్తాయి. వీటితో పాటు అర‌టి, లిట్చీ వంటి ఇతర పండ్ల‌ను కూడా తీసుకోవ‌చ్చు.