సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!

Updated on: Feb 08, 2026 | 11:47 AM

ఎండు చేపల పులుసు ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ లొట్టలేసుకొని మరి తింటారు. ఇక చాలా మంది టామటాలతో ఎండు చేపల పులుసు చేస్తుంటారు. కానీ ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు చేస్తే టేస్ట్ అదిరిపోతుందంట. కాగా, దీనిని ఇంటిలోనే చాలా సులభంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : ఉల్లిపాయలు నాలుగు నుంచి ఐదు, ఎండు చేపలు 150 గ్రాములు,	మెంతి పొడి వన్ టీస్పూన్, ధనియాల పొడి వన్ టీ స్పూన్, బిర్యానీ ఆకు ఒకటి.  లవంగాలు రెండు, కరివేపాకు ఒక రెమ్మ, ఉల్లిపాయలు రెండు, పచ్చి మిర్చి మూడు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్, చింత పండు నిమ్మకాయ సైజు, కారం రుచికి సరిపడ, ఉప్పు రుచికి సరిపడ, గరం మసాలా అర టీ స్పూన్, కొత్తిమీర.

2 / 5
ముందుగా ఎండు చేపలను వేడి నీటిలో రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి. మంచిగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి.

3 / 5
తర్వాత స్టవ్ పై మరో పాన్ పెట్టి, అందులో ఫ్రైకి సరిపడ  నూనె పోసుకోవాలి. ఇప్పుడు అందులో జీలకర్ర, బిర్యానీఆకు,కరివేపాకు , చిటికెడు పసుపు,  వేసి మంచిగా వేయించుకోవాలి. దీని తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయిస్తూనే ఉండాలి.

4 / 5
దాదాపు పది నిమిషాల తర్వాత వేయించి పెట్టుకున్న ఎండు చేపలను వేసి, మరో 5 నిమిషాలు వేయించుకోవాలి. దీని తర్వాత చింత పండు రసం పోసి, మంచిగా మరగ బెట్టుకోవాలి. పులుపు చూసి కొంచెం నీరు కూడా యాడ్ చేయాలి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, మెంతి పొడి వేసుకొని 15 నిమిషాలు మరగ పెట్టుకోవాలి.

5 / 5
పులుసు కొంచెం చిక్కగా వచ్చిన తర్వాత గరం మసాలా యాడ్ చేయాలి. దీని తర్వాత మీరు తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేయాలి. అంతే వేడి వేడి టేస్టీ టేస్టీ ఉల్లిపాయ, ఎండు చేపల పులుసు రెడీ.