
అందాల ముద్దుగుమ్మ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది టిక్ టాక్, రీల్స్ చేసి, జూనియర్ సమంతగా మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టి యాంకరింగ్, పలు షోలు చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

అంతే కాకుండా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో సంచలనం సృష్టించింది. ఈ ఇంటర్వ్యూ తర్వాత అషూ రెడ్డికి మంచి పాపులారిటీ వచ్చింది. తర్వాత తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది.

బిగ్ బాస్‌లో తన ఆటతీరు, మాటతీరు, అందంతో ప్రతి ఒక్కరినీ తన వైపుకు లాక్కుంది. ఇక బిగ్ బాస్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఈ అమ్మడుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ చిన్నది సుధీర్‌తో కలిసి ఫ్యామిలీస్టార్ షోలో హోస్టుగా చేస్తుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తుంటుంది. తన గ్లామర్‌తో నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది. ఎప్పుడూ ట్రెండీ డ్రెస్‌లో కనిపించి సోషల్ మీడియాలో రచ్చ చేసే ఈ బ్యూటీ తాజాగా లంగావోనీలో దర్శనం ఇచ్చింది.

పర్పుల్ కలర్ లంగావోణీ ధరించి, తన అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ట్రెడిషనల్ లుక్‌లో తన గ్లామర్ తో చంపేస్తుంది. మరి ఈ ముద్దుగుమ్మ బ్యూటిఫుల్ ఫొటోస్ మీరు కూడా చూసెయ్యండి.