Shaik Madar Saheb |
Updated on: Jul 04, 2023 | 4:55 PM
Tomato Price memes: ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు.. నాగులో నాగన్న.. అంటూ అప్పుడెప్పుడో వచ్చిన పాట తెగ ఫేమస్ అయింది.. కూరగాయలు, లేదా గ్యాస్, పెట్రోల్ ఇలా ఏ ధరలు పెరిగినా ఈ పాట మాత్రం తెరపైకి వస్తూనే ఉంటుంది.
అయితే, ఇప్పుడెందుకు వచ్చింది.. ఈ పాట అనుకుంటున్నారా..? మార్కెట్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కూరగాయల ధరలు పెరిగాయి.
ఇటీవల 20 నుంచి 30 రూపాయల వరకు లభించిన టమాటా ధరలు ఇప్పుడు కేజీ రూ.150 వరకు చేరింది. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ధరలు 120 నుంచి రూ.140 వరకు ఉంది.
ఒక్క టమాటాలే కాకుండా పచ్చి మిర్చి ధర కూడా కొండెక్కింది. ప్రస్తుతం కిలో మిర్చి ధర 120 కి పైగా ఉంది. అందుకే టమాటాలు, పచ్చి మిర్చి కొనాలంటే జనం వెనకాడుతున్నారు.
టామాటాలు, పచ్చిమిర్చి ధర పెరిగిన నేపథ్యంలో.. చాలా మంది నెటిజన్లు పలు రకాల మీమ్స్ తయారు చేసి నెట్టింట పోస్ట్ చేసి.. సందడి చేస్తున్నారు. టామాట.. టమాటా సాస్ ధరలను పోలుస్తూ.. అదే విధంగా మిర్చి.. టామాటాలను పోలుస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో పోస్ట్ చేస్తున్నారు.
ఇంకా బంగారం ధరలు, ఆపిల్ ధరలతో కూడా టమాటాలను పోల్చుతూ.. నెట్టింట సందడి చేస్తున్నారు. ఏదిఏమైనా ప్రస్తుతం టమాటా చాలా హాట్ గురూ..