
నిద్రలో చాలా మంది చాలా రకాలుగా పడుకుంటారు. మీరు పడుకునే విధానం కారణంగా కూడా మీకు అనేక సమస్యలు రావచ్చు. ఇంకొన్ని సమస్యలు తగ్గొచ్చు. ఈ విషయాలు చాలా మందికి తెలీదు. కొంత మందికి.. మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని నిద్రించడం అలవాటు. ఇలా పడుకుంటేనే నిద్ర కూడా పడుతుంది.

అయితే ఇది మంచి అలవాటు కాదని కొందరు అంటూంటారు. మరి మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని నిద్రిస్తే.. ప్రయోజనం ఉందా? లేక సమస్యలు రావచ్చా ఇప్పుడు తెలుసుకుందాం.

మోకాళ్ల మధ్య తలగడ పెట్టుకుని నిద్ర పోవడం వల్ల.. కండరాల తిమ్మిర్లు అనేవి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా పడుకోవడం వల్ల శరీరంలో అన్ని భాగాలకు రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది.

అయితే మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటే.. హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యలతో బాధ పడేవారు ఇలా చేస్తే.. ఈ ప్రాబ్లమ్ నుంచి బయట పడొచ్చు. ఇలా నిద్ర పోవడం వల్ల నరాల సమస్యలు కూడా రావు.

గర్భిణీ స్త్రీలు ఎడమ వైపు తిరిగి.. మోకాళ్ల మధ్యలో దిండు పెట్టుకుని పడుకుంటే.. పుట్టబోయే బిడ్డకు, మీకు ఎంతో మంచిది. రక్త ప్రసరణ సరిగ్గా జరిగి.. నొప్పులు ఏమైనా ఉంటే తగ్గుతాయి. వెన్నుముకకు సంబంధించిన సమస్యలు కూడా రావు.