ఆపిల్, అరటిపండు తినేముందు ఈ వాస్తవాలు తెలుసుకోండి.. ఈ తప్పులు చేశారో..

Updated on: Aug 03, 2026 | 6:58 AM

పండ్లు పోషకాల నిలయం. అందుకే రోజూ ఫ్రూట్స్ తినమని డాక్టర్లు చెప్తారు. అయితే మనకు సులభంగా దొరికే ఆపిల్, అరటిపండ్లలో ఏది రోజూ తింటే మంచిదనే డౌట్ చాలామందిలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి, తక్షణ శక్తి కావాలనుకునే వారికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5
ఆపిల్ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని పెక్టిన్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి, పొటాషియం, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. క్రమం తప్పకుండా ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉండటంతో పాటు గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఆపిల్ ఒక అద్భుతమైన ఎంపిక.

2 / 5
మరోవైపు అరటిపండు తక్కువ ధరలో లభిస్తూ, శరీరానికి తక్షణ శక్తిని అందించే పండ్లలో ప్రధానమైనది. ఇందులో పొటాషియం, వైటమిన్ బి6, వైటమిన్ సి, మెగ్నీషియం, సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. అరటిపండు రోజూ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండటంతో పాటు కండరాల పనితీరు మెరుగవుతుంది. ముఖ్యంగా పిల్లలు, క్రీడాకారులు, వ్యాయామం చేసేవారు కోల్పోయిన శక్తిని వేగంగా తిరిగి పొందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

3 / 5
ఈ రెండింటి ప్రయోజనాలను పోల్చి చూస్తే.. బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే లక్ష్యమైతే ఆపిల్ ముందు వరుసలో ఉంటుంది. అలాగే తక్షణ శక్తి, రక్తపోటు నియంత్రణ, కండరాల ఆరోగ్యానికి అరటిపండును మించినది లేదు. వ్యాయామం చేసిన తర్వాత శరీరానికి శక్తిని ఇవ్వడానికి అరటిపండు సరిపోతే, శరీరంలో వ్యాధుల నివారణకు ఆపిల్ మెరుగ్గా పనిచేస్తుంది.

4 / 5
వయస్సు, శరీర అవసరాల బట్టి కూడా వీటి ఎంపిక మారుతుంది. పంటి సమస్యలు ఉన్న వృద్ధులకు, పెరుగుతున్న పిల్లలకు మెత్తగా ఉండే అరటిపండు చాలా మంచిది. డయాబెటిస్ ఉన్నవారు మాత్రం వైద్యుల లేదా పోషకాహార నిపుణుల సలహాతో ఈ రెండు పండ్లను తగిన మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది.

5 / 5
కేవలం ఒకే పండుపై ఆధారపడటం కంటే విభిన్న రకాల పండ్లను ఆహారంలో చేర్చుకోవడమే నిజమైన ఆరోగ్యం. నిపుణుల ప్రకారం వారంలో కొన్ని రోజులు ఆపిల్, కొన్ని రోజులు అరటిపండుతో పాటు బత్తాయి, మామిడి వంటి కాల అనుగుణంగా దొరికే పండ్లను కూడా తినాలి. దీనివల్ల శరీరానికి కావలసిన అన్ని రకాల వైటమిన్లు, ఖనిజాలు లభించి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us