Rain Alert: ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాలకు వర్ష సూచన.. వచ్చే 2 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

Updated on: Apr 28, 2025 | 9:21 AM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తీవ్రమైన ఎండలతోపాటు.. అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

1 / 5
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తీవ్రమైన ఎండలతోపాటు.. అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సోమవారం (28-04-25) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

2 / 5
Weather Alert

Weather Alert

3 / 5
భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

4 / 5
అలాగే అల్లూరిసీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. రేపు ఉష్ణోగ్రతలు 40-42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. ఆదివారం అనకాపల్లి జిల్లా రావికమతం,వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో 41.4°C, విజయనగరం జిల్లా గుర్లలో 41.2°C, తూర్పుగోదావరి జిల్లా మురమండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.55 ప్రాంతాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపారు.

5 / 5
ఎండతీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.