Anti-cancer Diet: జీవితంలో క్యాన్సర్ రాకూడదంటే వీటిని ఆహారంలో తీసుకోండి.. నూరేళ్ల హాయిగా బతికేయొచ్చు

|

Jul 16, 2024 | 12:37 PM

క్యాన్సర్ ఎందుకు వస్తుంది? అనే విషయం వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా శాస్త్రవేత్తలకు తెలియ రాలేదు. అయితే రోజురోజుకు క్యాన్సర్ రోగుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. దీని నుంచి బయటపడటానికి వైద్యులు, పరిశోధకులు కొన్ని సూచనలు చేస్తున్నారు. క్యాన్సర్‌కు ఎక్కువగా జీవనశైలి కారణం. తప్పుడు ఆహారం నుంచి క్రమరహిత జీవనశైలి వరకు.. ప్రతిదీ క్యాన్సర్ వెనుక బాధ్యత వహిస్తుంది..

1 / 5
క్యాన్సర్ ఎందుకు వస్తుంది? అనే విషయం వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా శాస్త్రవేత్తలకు తెలియ రాలేదు. అయితే రోజురోజుకు క్యాన్సర్ రోగుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. దీని నుంచి బయటపడటానికి వైద్యులు, పరిశోధకులు కొన్ని సూచనలు చేస్తున్నారు. క్యాన్సర్‌కు ఎక్కువగా జీవనశైలి కారణం. తప్పుడు ఆహారం నుంచి క్రమరహిత జీవనశైలి వరకు.. ప్రతిదీ క్యాన్సర్ వెనుక బాధ్యత వహిస్తుంది.

2 / 5
ఉదాహరణకు.. చక్కెర, మైదా వంటి వాటితో చేసిన ఆహారాలు తింటే క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. అదేవిధంగా సెలీనియం అనే యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అయితే ఇది ఎక్కువగా ఎందులో ఉంటుంది.. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? అనే విషయాలు నిపుణుల మాటల్లో మీకోసం..

3 / 5
సముద్ర చేపలు క్యాన్సర్ నిరోధక ఏజెంట్లుగా పనిచేస్తాయి. వీటిల్లో సెలీనియంతో పాటు, సీఫుడ్‌లో ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బులను కూడా నివారిస్తాయి. అలాగే బ్రోకలీ, క్యారెట్, బీన్స్ వంటి కూరగాయలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఈ కూరగాయలు పెద్దప్రేగు, పొట్ట, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

4 / 5
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి వివిధ బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయి. గుడ్లు, చికెన్ తినడం ద్వారా కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చు. అలాంటి మాంసాహారాల్లో సెలీనియం, విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

5 / 5
దాల్చిన చెక్క, పసుపు వంటి మసాలా దినుసులు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. ఈ మూలికా పదార్ధాలు శరీరంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలుగా పనిచేసే అనేక పదార్ధాలను కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.