గుండెనిండా దేశభక్తి.. గుర్రాలతో నిరసన.. ఆ గిరిజనుల ఆవేదన ఎందుకో తెలుసా..?

Edited By:

Updated on: Aug 17, 2026 | 4:04 PM

వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. కొండ శిఖర గ్రామంలో నివాసం.. ఇరవై రెండు కుటుంబాలు నూటా ఇరవై మంది వరకు జనాభా.. పశువుల బంధ, జీలుగు లోవ, సోంపురం గ్రామాల్లో సామాలమ్మ కొండపై జీవనం.. కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగుతున్నారు... కనిపించిన వారందరికీ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.. పట్టించుకునే నాధుడే లేకపోవడంతో ఇక గళం విప్పారు.. స్వాతంత్ర దినోత్సవ వేళ త్రివర్ణ పతాకాలతో గుర్రాలపైనే ర్యాలీ చేశారు.. గుర్రాలతో మూడు కిలోమీటర్ల నిరసన యాత్ర చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేళ గుండె నిండా దేశభక్తి ఉన్నా.. పాలకులు తమ కష్టాలు తీర్చడం అందుకు ఆవేదన చేంతున్నారు ఆ అడవి బిడ్డలు.

1 / 5

2 / 5
అనకాపల్లి జిల్లా వేమడుగుల మండలాల సరిహద్దులోని సామలమ్మ కొండపై బంగారు బందలు, జిలుగులోవ,  సోంపురం, పశువుల బంధ గ్రామాలు ఉన్నాయి. ఈ కొండ శిఖర గ్రామాల్లో పివి టీజీ గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. 22 కుటుంబాలు 120 మంది ఉన్నారు. వారికి కనీస సౌకర్యాలు ఆమడ దూరం.. గ్రామానికిరోడ్డు సౌకర్యం లేదు… PVTG కొందు గిరిజనులకు ధ్రువపత్రాలు లేవు.. ఏదైనా కష్టం వస్తే డోలీమోతలే వారికి దిక్కు.. కాలినడక, బడికి వెళ్లాలంటే గుర్రాల పైన వాళ్ళ సవారి. దీంతో ఇక చేసేదిలేక ఆందోళన బాట పట్టారు. రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ గుర్రాలతో ర్యాలీ నిర్వహించారు.

3 / 5
స్వాతంత్రం వచ్చి 80ఏళ్ళు గడుస్తున్న.. తమ సమస్యలు మాత్రం తిరడం లేదంటూ ఆవేదన చెందారు. జాతీయ జెండా పట్టుకుని పశువులు బంధ నుంచి బంగారు బందరు రోడ్డు వరకు మూడు కిలోమీటర్లు నిరసన ప్రదర్శన చేశారు.

4 / 5
రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యం పాలైన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించలేక తోటి గిరిజనులు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు  కోల్పోతున్నారు. అలాగే.. గర్భిణీ స్త్రీలు తో పాటు ఎవరికైనా అనారోగ్యం గురైతే డోలి కట్టాల్సిందే. కిలోమీటర్ల వరకు డోలి మోయాల్సిందే.  రోడ్డు సౌకర్యం లేదు. దింతో.. రహదారి సౌకర్యం కోసం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు, చోడవరం ఎమ్మెల్యే కు  పలుమార్లు ఫిర్యాదు చేసామని… రహదారి లేక డోలుమూతలు తప్పడం లేదని వాపోయారు. రేషన్ బియ్యం, పెన్షన్, నిత్యవసరవస్తువులు తెచ్చుకోవాలంటే గుర్రాల మీదే ప్రయాణం చేయవలసి వస్తుందని వారి ఆవేదన. స్వర్ణాంధ్ర వికసిద్భారత్ నినాదాలతో హైవేలో విమానాశ్రయాలు నిర్మిస్తున్నారు కానీ మాకు సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదని ఆవేదన చెందుతున్నారు. నాన్ షెడ్యూల్ పై పాలకుల చిన్నచూపు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

5 / 5
వెంటనే అధికారులు తమ సమస్యను గుర్తించి.. పశువులు బంద, జీడుగులోవ, సోంపురం బందరు వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడి సెంటర్, ఆశా కార్యకర్తల తమ గ్రామాలకు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ నిరసన ప్రదర్శనలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందరావు పివిటిజి సంఘం నాయకులు కామేశ్వరరావు, వాసు, వంతల దాసు, చిలకమ్మ  పీవీటిజీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us