
ఫైబర్ అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉండే ఎండుద్రాక్ష శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తొలగిస్తుంది. అంతేకాదు ఎండుద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది నోటి దుర్వాసనను తొలగిస్తుంది.

ఎముకలను దృఢంగా ఉంచడంలో ఎండుద్రాక్ష చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా, ఎండుద్రాక్షలో కాల్షియం పుస్కలంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. వీటిల్లోని విటమిన్, ఎ-కెరొటెనాయిడ్, బీటా కెరొటెన్‌లు కంటిచూపును మెరుగుపరుస్తాయి.

రాత్రంతా ఎండు ద్రాక్షని నానబెట్టి తింటే.. రక్తం శుద్ధి అవుతుంది. బ్లడ్ ఇన్ ఫెక్సన్స్ లేదా ఇతరత్ర ఇన్ ఫెక్షన్స్ ఉన్నవారు ఎండు ద్రాక్షను నానబెట్టుకుని తింటే మంచి ఫలితాలు ఉంటాయి.

అంతేకాకుండా ఎండుద్రాక్షలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. కాబట్టి రోజూ కనీసం 5 నుంచి 6 ఎండు ద్రాక్షలు తినడం అలవాటు చేసుకోవాలి. వీటిని తినడం వల్ల ఎలాంటి బాక్టీరియా ఇన్ఫెక్షన్ దరిచేరకుండా నివారిస్తుంది.

చాలా మంది ప్రస్తుతం పాలు, పెరుగు తినడం లేదా తాగడానికి ఇష్ట పడటం లేదు. దీంతో ఎముకలు బలహీన పడతాయి. అలాంటి వారు నానబెట్టిన ఎండు ద్రాక్ష తినడం వల్ల క్యాల్షియం కొరత ఏర్పడదు. దీని వల్ల శరీరంలో క్యాల్షియం స్థాయిలు పెరిగి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.