
పోహాలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు ఉన్నాయి. మీ శరీరానికి ఉదయం కార్బోహైడ్రేట్ల రూపంలో శక్తి అవసరం కాబట్టి ఇది మంచి అల్పాహారం. బియ్యంతో తయారు చేయబడిన పోహాలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కెరను నియంత్రించడంలో మంచి సహాయకారి

పోహా తయారీకి కావాల్సిన పదార్ధాలు: అటుకులు, టమాటా, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి , కరివేపాకు, కొత్తిమీర, వేరుశనగలు , పసుపు, పచ్చి బఠాణీలు, నూనె, ఉప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, నిమ్మరసం కావాల్సిన పదార్ధాలు.. ఇవన్నీ అందుబాటులో ఉంటె పోహాను కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.

తయారీ విధానం: ముందు అటుకులను శుభ్రంగా కడిగి నీరు లేకుండా పిండి ఒక జల్లెడ లాంటి గిన్నెలో వేసుకోండి. స్టవ్ మీద బాణలి పెట్టి.. నూనె వేసి వేరుశనగ పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి అనంతరం ఉల్లిపాయలు, బఠాణీలు, క్యారెట్, టమాటా వేసి వేయించండి..

. చివరిగా కడిగి పక్కకు పెట్టుకున్న అటుకులను వేసి బాగా కలపండి. కొంచెం సేపటి తర్వాత నిమ్మరసం, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి ఒక్కసారి కలపండి. అంతే టేస్టీ టేస్టీ ఫోహా రెడీ

పోహ తయారీకి ఉపయోగించిన పదార్ధాలతో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్‌ల తోపాటు విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ వంటి విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి, కరివేపాకు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, ఇన్‌ఫెక్షన్‌లను దూరం చేస్తుంది. చర్మం, జుట్టుకు మంచిది.

పోహాలో ఎలాంటి ప్రొటీన్లు ఉండవు. అయితే సంప్రదాయ పద్ధతిలో పోహా తయారీలో వేరుశెనగలు వేస్తారు. దీంతో ఇది ప్రోటీన్ రిచ్ అల్పాహారంగా మారుతుంది. పోహా తయారీలో అటుకులను ఉపయోగిస్తారు. కనుక తేలికగా జీర్ణమవుతుంది. కడుపు తేలికగా ఉంటుంది. ఉబ్బరం అనిపించదు.

పోహా తయారీలో ఉప్పయోగించే టొమాటోలు, క్యారెట్‌లు కూడా శరీరానికి పోషకాలను అందిస్తాయి. విటమిన్ ఎ , ఇ, సి లతో పాటు యాంటీ-ఆక్సిడెంట్ల సంవృద్ధిగా అందుతాయి. పోహా అనేది బియ్యంతో తయారు చేయబడిన అటుకులతో తయారు చేస్తారు. కనుక ఇది ఆరోగ్యకరమైన, గ్లూటెన్ రహిత-అల్పాహారం..