ముల్లంగి ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, గుండెను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. బలహీనమైన రోగనిరోధక శక్తితో బాధపడుతున్న వారికి ముల్లంగి ఆకులను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ముల్లంగి ఆకులు రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.
ముల్లంగి ఆకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, ముల్లంగి ఆకులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ముల్లంగి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు , ఇతర ఇన్ఫెక్షన్లను నివారించడంలో మేలు చేస్తుంది.
ముల్లంగి ఆకుల్లో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనతతో బాధపడేవారికి మేలు చేస్తుంది. అంతే కాకుండా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. తరుచుగా ముల్లంగి ఆకులను వాడటం వల్ల రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది.
ముల్లంగిలో విటమిన్ సి ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముల్లంగి శీతాకాలంలో సాధారణ శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది.
ముల్లంగిలో పొటాషియం ఉంటుంది. అందువల్ల ఈ కూరగాయ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటే స్ట్రోక్, గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.