1 / 5
వాతావరణం చల్లగా లేదా వేడిగా ఉన్నా ఏ సమయంలోనైనా దగ్గు సంభవించవచ్చు. వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు దగ్గుకు కారణమవుతాయి. హెర్బల్ టీ లేదా గోరువెచ్చని నీటిలో నిమ్మ, తేనె కలిపి తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. రుచి కోసం అందులో 2 టీస్పూన్ల తేనె కూడా కలుపుకోవచ్చు. తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే తులసి ఆకులు కొన్ని తేనెతో కలిపి నమిలినా ఫలితం ఉంటుంది.