
అక్షయ తృతీయ రోజు పసుపు కుంకుమ కొనుగోలు చేసినా చాలా మంచిదంట. ఈరోజు పసుపు కుంకుమ కొనుగోలు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగటమే కాకుండా అన్నివిధాలుగా ప్రయోజనాలు చేకూరుతాయంట. ఇంటిలో సంపద పెరిగి, అనుకున్న పనులన్నీ సమయానుగుణంగా పూర్తి అవుతాయని తెలిపారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

అక్షయతృతీయ రోజు బంగారం వెండి మాత్రమే కాదండోయ్, ఈ రోజు మట్టి కుండ కొనుగోలు చేసినా కూడా అదృష్టం కలిసి వస్తుందంట. ఈరోజున ఎవరు అయితే కొత్త మట్టి కుండను కొనుగోలు చేస్తారో, వారు తమ జీవితంలో ఎలాంటి అపజయాలు లేకుండా విజయంతో ముందుకు వెళ్తారు. ఐశ్వర్యం పెరుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. జీవితంలో చాలా ఉన్నతస్థానంలో ఉంటారు.

తులసి మొక్క : ఇంటిలో తులసి మొక్క లేని వారు అక్షయ తృతీయ రోజున తులసి మొక్క కొనుగోలు చేయడం చాలా మంచిదంట. ఈ రోజు తులసి మొక్క కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్లే, ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఇంటిలో సంపద పెరుగుతుందంట.

ఉప్పు : అక్షయ తృతీయ రోజున బంగారం వెండి కంటే ఉప్పు కొనుగోలు చేయడం చాలా మంచిదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఈ రోజు ఉప్పు కొనుగోలు చేయడం వలన సంప పెరుగుతుంది. ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ తొలిగి పోయి సానుకూల శక్తి పెరుగుతుంది. అందుకే తప్పకుండా ఈ రోజు ఉప్పు కొనుగోలు చేయాలని చెబుతున్నారు పండితులు.

పుస్తకాలు : అక్షయ తృతీయ రోజు పుస్తకాలు కొనుగోలు చేయడం కూడా చాలా శుభప్రదం. ఈరోజు పుస్తకాలు కొనుగోలు చేయడం వలన లక్ష్మీదేవి, సరస్వతీ దేవి కటాక్షం కలుగుతుంది. మీ పిల్లలు విద్యలో చాలా ఉన్నతంగా రాణిస్తారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు