ఒప్పుకున్న సినిమాలన్నీ అయిపోవడం.. కొత్త ఆఫర్స్ కోసం వేచి చూస్తున్నారీ బ్యూటీ. మరోవైపు మృణాళ్ ఠాకూర్ ఆచితూచి కొత్త సినిమాలు సైన్ చేస్తున్నారు.
బాలీవుడ్ నుంచి వచ్చినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిన్నదాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. మిగతా హీరోయిన్స్ లా బాలీవుడ్ నుంచి వచ్చి ఒకటి రెండు సినిమాల్లో నటించి మళ్లీ అక్కడికి చెక్కేయలేదు మృణాల్.
టాలీవుడ్ లోనే ఆచి తూచి అడుగులేస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది మృణాల్.
ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో ఆకట్టుకుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో నటించింది. తండ్రి కూతురు మధ్య సాగే ఈ అందమైన ఎమోషనల్ డ్రామా కూడా సూపర్ హిట్ అయింది.
ఈ సినిమాలోనూ మృణాల్ తన నటనతో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో గ్లామరస్ గానూ కనిపించి మెప్పించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేసింది.
ఇక తాజాగా మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ సంబంధించి మరింత స్టైలిష్ గా ఉండటంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి.