
కశ్యపుడు ప్రతి ఒక్కరికీ తెలుసు,ఈయనను వాల్మీకి రామాయణం ప్రకారం, బ్రహ్మ కుమారుడు అంటారు. ఇక ఈయనకు 21 మంది భార్యలు. వారిపేర్లలోకి వెళితే, దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల , తామ్ర, వశ, ముని మొదలైన వారు దక్షుని కుమార్తెలు.

అయితే కశ్యపునికి కద్రువ వలన నాగులు జన్మించగా, వినత వలన గరుత్మంతుడు, అనూరుడు జన్మిస్తారు. అయితే వినత అంటే కద్రువకు అస్సలు పడకపోయేదంట. ఎప్పుడూ తనపై పగను పెంచుకునేదంట. దీంతో ఒక రోజు వీరిద్దరూ కలిసి బయటకు వెళ్లగా, అక్కడ కద్రువ తెలివిగా ఒక పందెం కాస్తుంది. అందులో నువ్వు ఓడిపోతే నాకు జీవితాంతం దాస్యం చేయాలని చెబుతుంది వినతకు. దీంతో వినత కూడా ఈ పందెంకు ఒప్పుకుంటుంది.

అయితే వీరికి అప్పుడే దూరంగా ఓ గుర్రం కనిపిస్తుంది. దాని తోక నల్లగా ఉందని, కద్రువ, వినతకు చెబుతుంది. కానీ అది అబద్ధం అంటూ అక్కడ ఉన్న గుర్రానికి నల్లటి తోకలేదు అని గట్టిగా వాదిస్తుంది వినత. దీంతో ఇద్దరం అక్కడికి వెళ్లి చూద్దాం, తోక నల్లగా ఉంటే నేను గెలిచినట్లు, నువ్వు నాకు దాస్యం చేయాలి అంటుంది. దానికి మరోసారి వినత సరే అని సమాధానం చెబుతుంది.

ఈ క్రమంలోనే కద్రువ తన తెలివిని ఉపయోగించి, మనసులో తన కుమారుడైన తక్షకుడిని మనసులో వేడుకుంటుంది. నువ్వు వెళ్లి గుర్రం తోక దగ్గర ఉండాలని చెబుతుంది. తక్షకుడు నల్లటి పాము, దీంతో తక్షకుడు వెళ్లి గుర్రం తోక భాగంలో నల్లటి తోకలా మారతాడు, అలా వినత ఓడిపోయి సేవలు చేస్తుంది. కానీ ఇది నచ్చని వినత కుమారుడు గరత్మంతుడు, తన తల్లి దాస్యం పొగొట్టడానికి ఏం చేయాలి అంటూ తన పిన్ని అయినా కద్రువను వేడుకుంటాడు, అప్పుుడ కద్రువ దేవతల నుంచి అమృతం తీసుకొస్తే నేను నీ తల్లిని దాస్యం నుంచి విముక్తి చేస్తాను అని చెబుతుంది.

ఎందుకంటే? ఆ అమృతం తన కుమారులు తాగడం వలన వారికి అమరత్వం కలుగుతుందని, దీంతో గరత్ముంతుడు పోరాడి అమృతం తీసుకొస్తాడు, కానీ అది పాములకు దక్క కూడదని ఇంద్రుడికి అప్పగిస్తాడు, ఈ క్రమంలో కొన్ని బిందువులు దర్భ గడ్డిపై పడగా, పాములు వాటిని నాకుతాయి. అయితే దర్భలు కాస్త పదునుగా ఉండటం వలన పాముల నాలుక రెండుగా చీలుతుంది. అప్పుడు తన తల్లిని దాసిగా ఉంచినందుకు, గరత్మంతుడు కద్రువ సంతానం ఇప్పటి నుంచి నాలుక చీలి ఉంటుందని శాపం పెడుతాడు. అలా పాముల నాలుకలు చీలి, రెండుగా ఉంటాయంట. ( నోట్ : ఇది ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)