
అపరాజిత పువ్వులు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పువ్వులను ఎక్కువగా పూజలు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పూలకు భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. అపరాజిత పువ్వుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని ఆయుర్వేదంలో ఎన్నో రకాల సమస్యలను కంట్రోల్ చేయడంలో ఉపయోగిస్తారు.

శంఖు పూలను మరిగించిన నీటిని తాగడం వల్ల కంటికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు కంట్రోల్ అవుతాయి. కంటికి రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. శంఖు పూలతో జుట్టు సమస్యలు అన్నీ తగ్గుతాయి. తెల్లటి జుట్టు నల్లగా మారుతుంది.

ఎలాంటి చర్మ సమస్యలను అయినా కంట్రోల్ చేయడంలో అపరాజితి పూలు చాలా చక్కగా పని చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా, ముడతలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

అపరాజిత పువ్వులోకి యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఈ పూలతో మెదడు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచే గుణాలు ఇందులో ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి.

శంఖు పూల టీ తాగినా, నీటిని తాగినా షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. అలాగే ఇన్సులిన్ సామర్థ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి. డయాబెటీస్‌తో బాధ పడేవారు ఈ టీ తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)