8వ తరగతి బాలుడి టాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే.. రావి ఆకుపై సుభాష్ చంద్రబోస్ చిత్రం

Edited By:

Updated on: Jan 24, 2026 | 6:09 PM

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని స్థాపించి బ్రిటీష్ సామ్రాజ్య వాదులకు ముచ్చెమటలు పట్టించిన స్వతంత్ర సమరయోధుడు నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23 న ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి తన ప్రతిభతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాడు.

1 / 5
ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఈరన్న అనే విద్యార్థి రావి ఆకుపై సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని గీసి ప్రతిభ చాటాడు.

2 / 5
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని స్థాపించి బ్రిటీష్ సామ్రాజ్య వాదులకు ముచ్చెమటలు పట్టించిన స్వతంత్ర సమరయోధుడు నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి  23 న  ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు.

3 / 5
అయితే ఈ సందర్భంగా  పట్టణంలోని అమరావతి నగర్ లో నివాసముంటున్న సెంట్రింగ్ మేస్ర్తీ యం. నరసింహులు, యం.దేవికల పెద్ద కుమారుడు ఈరన్న, ఆదోని పట్టణంలోని  నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాల 8వ తరగతి ఏ విభాగం లో చదువుతున్నాడు.

4 / 5
ఈ చిన్నోడు తన అద్భుతమైన ప్రతిభతో,  రావి ఆకుపై నేతాజి సుభాష్ చంద్రబోస్ చిత్ర పటం ఆకృతిని తయారుచేసి అబ్బురపరిచాడు. పాఠశాల మండల విద్యాధికారి -2 శ్రీనివాసులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫయాజుద్దీన్ మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థి ఈరన్న ను డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్. కీర ను ప్రత్యేకంగా అభినందించారు.

5 / 5
ఈ సందర్భంగా విద్యార్థి ఈరన్న మాట్లాడుతూ డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్.కీర ప్రత్యేక శిక్షణతో ఈ చిత్రాన్ని చేశానని, ఈ చిత్రం చేయడానికి 2 గంటల సమయం పట్టిందని తెలిపాడు. అనంతరం డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్. కీర మాట్లాడుతూ విధ్యార్థులలోని సృజనాత్మకతను నైపుణ్యాన్ని వెలికితీసేందుకు, స్వతంత్ర సమరయోధుల గురించి తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటామని తెలిపారు.