
గుండె సమస్యలను అదిగమించేందుకు మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. కాబట్టి మీ ఆహారంలో ఓట్స్ ను చేర్చుకోండి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతాయి. వాటిలో బీటా గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ ఉదయం ఓట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లా తీసుకుంటే రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. ఇది ధమనులు మూసుకుపోయే ప్రమాదాన్ని తగ్గించి గుండె సమస్యలను నివారిస్తుంది.

బాదం, వాల్‌నట్స్: గుండె ఆరోగ్యానికి బాదం, వాల్‌నట్స్ కూడా మంచి ఎంపిక. వీటిలో ఏండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ విటమిన్ E గుండె వాపును తగ్గిస్తాయి. కాబట్టి ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదం, వాల్‌నట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చెంది గుండె సమస్యలు రాకుండా కాపాడుతాయి.

ఆకుపచ్చ కూరగాయలు: పాలకూర, మెంతులు, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలు గుండె ఆరోగ్యానికి దివ్యౌషదం వంటివి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ కూరగాయలు రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. అలాగే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఆపిల్స్: గుండె ఆరోగ్యానికి ఆపిల్స్ కూడా మంచి ఎంపిక వీటిలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది, ఇది చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ధమనులను బలోపేతం చేసే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఆపిల్స్ ను ఎల్లప్పుడూ తొక్కతో పాటు తినాలి.

అవిసె గింజలు: అవిసె గింజల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి గుండె మంటను తగ్గిస్తాయి. అవిసె గింజలను క్రమం తప్పకుండా తిసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)