
జీర్ణక్రియ సరిగా లేని వారు గుడ్లు తినడం తగ్గించాలి. ముఖ్యంగా కడుపులో గ్యాస్, ఆమ్లత్వం, అజీర్ణంతో బాధపడుతున్నవారు గుడ్లు తినడం వల్ల మీ కడుపులో బరువు పెరుగుతుంది. ఎందుకంటే అవి వేడిగా ఉంటాయి. జీర్ణక్రియను మరింత కష్టతరం చేస్తాయి.

గుడ్లను పోషకాహారానికి సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. వీటిలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కొవ్వు ఉండదు. పచ్చసొనలో విటమిన్లు A, D, E, K, B12, అలాగే ఇనుము, జింక్, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి.

ఊబకాయంతో బాధపడుతున్న వారు కూడా గుడ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తరచూ గుడ్డు తినటం వల్ల ఇది మరింత బరువును పెంచుతుంది. అలాగే, డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు కూడా సాధ్యమైనంత తక్కువ మోతాదులోనే గుడ్లు తీసుకోవాలని చెబుతున్నారు.

కొంతమంది గుడ్డు తినప్పుడు అలర్జీ కలుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు గుడ్డును తీసుకోవడం మంచిది కాదు. అలాగే మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు కూడా గుడ్డు తీసుకోవడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గుండె జబ్బులు ఉన్నవారు కూడా గుడ్లు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. గుడ్లు తినటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దీంతో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా హార్ట్‌ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.