చర్మాన్ని శుభ్రం చేయడానికి కూడా గ్లిజరిన్‌ని ఉపయోగించవచ్చు. 1/2 కప్పు నీటిలో 1/2 టీస్పూన్ గ్లిజరిన్, కార్న్‌ఫ్లోర్ కలపాలి. ఈ మిశ్రమంతో చర్మాన్ని మసాజ్ చేసుకుని గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. గ్లిజరిన్‌ను టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. స్ప్రే బాటిల్‌లో మినరల్ వాటర్ తీసకుని, అందులో 2-3 చుక్కల గ్లిజరిన్ కలపాలి. టోనర్‌ని ముఖంపై స్ప్రే చేయడం వల్ల చర్మరంధ్రాలు మూసుకుపోయి చర్మం బిగుతుగా మారుతుంది.