1 / 6
అధిక కొలెస్ట్రాల్‌కు ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లు. దీన్ని నివారించడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అలాంటి పదార్థాలు ఎప్పుడూ ఆహారంలో చేర్చుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చెడు ఆహారపు అలవాట్లు గుండెపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆహారం తప్పుగా ఉంటే, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది అనేక గుండె సమస్యలకు కారణమవుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్‌కు కారణమవుతుంది. అందువల్ల, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే వాటిని మీ ఆహారంలో చేర్చుకోవాలి. అల్పాహారంలో కొన్ని ఆహారాలను తింటే కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచడంతోపాటు.. ఆరోగ్యాన్ని కాపాడుతుంది.