
కావలసిన పదార్దాలు : ఒక కప్పు నువ్వుల గింజలు, రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ పసుపు పొడి , అర టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, మూడు టేబుల్ స్పూన్స్ కారం పొడి, అర టేబుల్ స్పూన్ మెంతులు, ఇంకా సరిపడా వంట నూనెను తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే టేస్ట్ అద్భుతం

కొండ ప్రాంతపు నువ్వుల పచ్చడి తయారుచేసే విధానం: మీరు ముందుగా నువ్వులను తీసుకుని వాటిని బాగా కడిగి కొద్దీ సేపు ఆరనిచ్చి ఆ తర్వాత ఒక పాన్ లో ఆయిల్ వేసి వేయించాలి. అది బాగా వేడయ్యాక ఆవాలు వేసి వేయించి ఆ తర్వాత నాలుగు మెంతులు, ఇంకా కొద్దిగా అల్లం కూడా వేసి కొద్దిసేపు వేయించండి.

కొండ ప్రాంతపు నువ్వుల పచ్చడి తయారుచేసే విధానం స్టెప్ 1 : ఇక ఇప్పుడు దీనిలో నువ్వులను వేసి కొద్దీ సేపు అయ్యాక కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇంకా మీరు ఈ రసాన్ని కూడా వేస్తే పచ్చడి రుచి డబుల్ అవుతుంది. ఇంకా దీనిని మీడియం ఉడికిస్తే నువ్వుల పచ్చడి రెడీ

బలహీనంగా ఉన్న వాళ్లు, రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు కూడా దీనిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీని కోసం ఎక్కువ సమయం కూడా అవసరం లేదు 15 నిమిషాల్లో నువ్వుల పచ్చడి రెడీ అవుతుంది అన్నంలో మీరు ఒక్కసారి దీనిని కలుపుకుని తింటే కూర రుచి అదిరిపోద్ది. పక్కగా దీనిని ట్రై చేయండి.

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)