భారత్ నిర్ణయంతో కశ్మీర్‌లో రక్తపాతమే..పాక్ విదేశాంగ మంత్రి కామెంట్స్

Pakistans Ministry of foreign affairs Qureshi condems and sensational comments on Article 370, భారత్ నిర్ణయంతో కశ్మీర్‌లో  రక్తపాతమే..పాక్ విదేశాంగ మంత్రి  కామెంట్స్

జమ్ము కశ్మీర్‌‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడంపై పాక్ నిప్పులు కక్కుతోంది. సోమవారం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందడం, రాష్ట్రపతి ఆమోదం కూడా తెలపడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే జమ్ము కశ్మీర్ విషయంలో కేంద్ర తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కశ్మీర్‌లో రక్తపాతానికి దారితీస్తుందన్నారు. తమతో పాటు కశ్మీర్ నాయకత్వం కూడా అంగీకరించే పరిస్థితి లేదని తెలిపారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దుపై పాక్ మీడియా కూడా భారత్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ప్రపంచమంతా కాశ్మీరీలకు అండగా నిలవాలని కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *