తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ కూర్పుపై కసరత్తు, ఆర్థికలోటును పూడ్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ

|

Feb 05, 2021 | 3:46 AM

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై కసరత్తు మొదలైంది. బడ్జెట్‌కు సంబంధించి ఆయా శాఖలనుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు తీసుకుంది...

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ కూర్పుపై కసరత్తు, ఆర్థికలోటును పూడ్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ
Follow us on

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై కసరత్తు మొదలైంది. బడ్జెట్‌కు సంబంధించి ఆయా శాఖలనుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు తీసుకుంది. కేంద్రంనుంచి రావాల్సిన గ్రాంట్లలో 3వేల 700 కోట్ల రూపాయల కోత ప్రత్యక్షంగా కనిపిస్తోంది. కరోనా, లాక్‌డౌన్‌ తెలంగాణ ఆదాయవనరులపై తీవ్ర ప్రభావం చూపించాయి. పోయినేడాది ఏడెనిమిది నెలలపాటు లిక్కర్‌షాపులు తెరుచుకోలేదు. రిజిస్ట్రేషన్లు సాగలేదు. దీంతో అటు ఎక్సైజ్‌, ఇటు రిజిస్ట్రేషన్‌ శాఖల నుంచి రావాల్సిన ఆదాయం గణనీయంగా పడిపోయింది. వాణిజ్య కార్యకలాపాలు మందగించటంతో జీఎస్టీ వాటా కూడా తగ్గింది. మొత్తం మీద ఈ సంవత్సరం 15వేలనుంచి 20వేల రెవెన్యూలోటు స్పష్టంగా కనిపిస్తోంది.

తెలంగాణలో ఏటా ఎక్సైజ్‌ నుంచే 20వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. అందులో మూడోవంతు ఆదాయానికి గండిపడింది. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్ నుంచి 5వేల కోట్ల రాబడి తగ్గింది. గత రెండునెలల నుంచే మళ్లీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత గాడినపడింది. రిజిస్ట్రేషన్లు కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. దీంతో బడ్జెట్‌ కల్లా ఎంతోకొంత లోటు పూడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లలో 3వేల 700 కోట్లు కోత పడటంతో పరిస్థితి మొదటికొచ్చింది.

కరోనా సంక్షోభంలో కేంద్రం అదనపు నిధులిస్తుందనుకుంటే.. రావాల్సినవే రాకపోవటంతో ఈసారి బడ్జెట్‌ కసరత్తు సర్కారుకు సవాలుగానే ఉంది. సంక్షేమ పథకాలను కోత లేకుండా యథాతథంగా కొనసాగించాల్సి ఉంటుంది. దీంతో ఆర్థికలోటును పూడ్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో ఉంది ప్రభుత్వం. ఆదాయ మార్గాలపై అధికారులతో చర్చించారు సీఎం కేసీఆర్‌. సీఎస్‌తో పాటు ఆర్థికశాఖ కార్యదర్శి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఆర్థికమంత్రి హరీష్‌రావు ఈ సమీక్షకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.

ఏపీలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసంపై పీఠాధిపతుల ఆగ్రహం.. త్వరలో తిరుపతిలో సనాతన ధర్మ పరిరక్షణ మహాసభ

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. మళ్లీ ఉద్యమం. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటైజేషన్‌ చేయాలన్న నిర్ణయంతో రోడ్డెక్కుతోన్న పార్టీలు, సంఘాలు