Ramappa Sandbox Technology: అరుదైన గౌరవం వెనుక రామప్ప ఇంజనీరింగ్ వండర్ టెక్నాలజీ.. నిర్మాణంలోని మెలుకువలు..

|

Jul 26, 2021 | 8:21 AM

Sandbox Technology: తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు సాదంచిన ఘనత ఏకైక రామప్ప దేవాలయానికి దక్కింది.. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చారిత్రక దేవాలయానికి ఎట్టకేలకు ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. అయితే ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించారు..

Ramappa Sandbox Technology: అరుదైన గౌరవం వెనుక రామప్ప ఇంజనీరింగ్ వండర్ టెక్నాలజీ.. నిర్మాణంలోని మెలుకువలు..
Ramappa Temple Sandbox Tech
Follow us on

తెలుగోడి కీర్తిప్రతీక రామప్పకు అరుదైన గౌరవం దక్కింది.. ఆ చారిత్రక నిర్మాణం విశ్వ సంపదగా గుర్తింపు పొందింది. యునెస్కో గుర్తింపు కోసం భారతదేశం నుండి రెండు, ప్రపంచ వ్యాప్తంగా 255 ప్రతిపాదనలు వెళ్లగా రామప్ప కు ఆ ఘనకీర్తి లభించింది. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపుపొందిన ఏకైక నిర్మాణంగా అరుదైన ఘనత స్వంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి.. ఆ జిల్లా నేతల సంకల్పం సఫలమవడంతో ఓరుగల్లు ప్రజలు, ప్రజాప్రతి నిధులు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు సాదంచిన ఘనత ఏకైక రామప్ప దేవాలయానికి దక్కింది.. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చారిత్రక దేవాలయానికి ఎట్టకేలకు ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది.  వరంగల్‌ రామప్ప ఆలయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఇస్తున్నట్లు వెల్లడించింది.

ఇంజనీరింగ్‌, శిల్పకళకు నెలవైన రామప్ప ఆలయం ఇక మీదట ప్రపంచస్థాయి కట్టడమని సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు… చైనాలో జరిగిన యూనెస్కో సమావేశం రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడ హోదాను కట్టబెట్టింది.

2020 ఏడాదికి గాను రామప్పకు ఈ హోదా దక్కింది. 2021 ఏడాది నామినీగా గుజరాత్‌కి చెందిన ధోలవీర ఆలయం వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ బరిలో ఉంది..రామప్పకు వారసత్వ సంపద హోదా రాకుండా నార్వే అడ్డుకునే యత్నం చేయగా, భారత్‌ తరఫున రష్యా వాదించింది.. రష్యాతోపాటు 17 దేశాలు ఆమోదం తెలపడంతో రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ స్థాయి యునెస్కో గుర్తింపు లభించింది.. యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ జాబితాలో 167 దేశాల నుంచి 1,121 కట్టడాలు పోటీ పడ్డాయి..

ఐదేళ్లుగా వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ గుర్తింపు కోసం మొత్తం మూడు చారిత్రక కట్టడాలు పోటీ పడగా అందులో సాంకేతిక కారణాల వల్ల ఖిలావరంగల్‌, వేయిస్థంభాలగుడిలు తుది జాబితాలో చోటు దక్కించు కోలేకపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయం ఒక్కటే ఎన్నికైంది..

ఆ తర్వాత వరల్డ్‌ హెరిటైజ్‌ సైట్స్ టెంటిటీవ్‌ జాబితా 2014లో చోటు దక్కించుకుంది.. అనంతరం వరల్డ్‌ హెరిటైజ్‌ సైట్స్‌ గుర్తింపుకి ఇండియా తరఫున 2020గాను రామప్ప ఎంపికైంది..అయితే గత ఏడాది కరోనా కారణంగా యూనెస్కో కమిటీ సమావేశం నిర్వహించలేదు.

40 ఏళ్ల పాటు కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు శివుని మీద ఉన్న ఆపారమైన భక్తితో 1213లో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు.. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు 40 ఏళ్ల సమయం పట్టిందని చరిత్ర చెబుతోంది.. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు రామప్ప అనే శిల్పి చేపట్టాడు.. ఆ శిల్పి పేరిటే ఆలయం నిర్మాణమైంది.

Ramappa Temple

సాండ్ బాక్స్‌ టెక్నాలజీతో ఇసుక పునాదులపై ఈ చరిత్రక ఆలయాన్ని నిర్మించారు.. అయితే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువ..ఎక్కువ బరువు ఉండే రాతి నిర్మాణాలను ఈ నేలలు తట్టుకోలేవు.. అందుకే నేల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఇంజనీరింగ్‌ నైపుణ్యం ప్రదర్శించారు..

దీన్ని నేటి ఇంజనీర్లు శాండ్‌ బాక్స్‌ టెక్నాలజీగా పేర్కొంటున్నారు. ఆలయం నిర్మాణ స్థలంలో మూడు మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపారు. ఈ ఇసుక ఎప్పుడు తడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇసుకపై రాళ్లను పేర్చుకుంటూ పోయి కక్ష్యా మంటపం వరకు నిర్మించారు. అక్కడి నుంచి ఆలయ నిర్మాణం చేపట్టారు.

Ramappa Temple Constructed

తేలియాడే ఇటుకలు నేల స్వభావాన్ని బట్టి ఆలయం బరువును తగ్గించేందుకు అత్యంత తేలికైన ఇటుకలను తయారు చేశారు. సాధారణ నిర్మాణంలో వినియోగించే ఇటుకలు 2.2 సాంద్రతను కలిగి ఉంటాయి. కానీ రామప్ప ఆలయ గోపురానికి వాడిన ఇటుకలు కేవలం 0.8 సాంద్రతను కలిగి ఉంటాయి. అందుకే ఇవి తక్కువ బరువు కలిగి ఉండి నీటిలో తేలియాడుతుంటాయి.. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు చెబుతున్నారు.

ఇక ఆలయం నలువైపులా ఆనాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఈజిఫ్టు, మంగోలియన యాత్రికుల శిల్పాలు అబ్బరు పరుస్తాయి.ఆలయం లోపల నాట్యమంటపం ఆనాటి శిల్ప కళా వైభవానికి తార్కాణంలా నిలిచిపోతుంది.. సూది బెజ్జం సందుతో అతి సూక్ష్మమైన శిల్పాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి.

Ramappa Temple Was Construc

అంతేకాదు ఆలయం బరువును మోస్తున్నట్టుగా వందలాది ఏనుగుల శిల్పాలను చెక్కారు. అయితే ఒక ఏనుగుతో మరో ఏనుగుకు సంబంధం లేకుండా విభిన్నంగా ఉంటాయి. ఇక శివుడి ఎదురుగా ఉన్న నంది గురించి వర్ణించడానికి మాటలు చాలవు.. శివుడి ఆజ్ఙ కోసం ఎదురు చూస్తున్నట్టుగా చెవిని లింగం వైపుకు పెట్టి.. లేవడానికి తయారుగా ఉన్నట్టుగా నందిని మలిచాడు శిల్పి రామప్ప.

ఈ అపురూప నిర్మాణానికి యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర- రాష్ట్రప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేశాయి..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 24 దేశాలలో చర్చించి మేధో మధనం చేశారు.. వరంగల్ కు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిగేలా చేశారు.

ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించాయి.. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు స్వంతం చేసుకున్న చారిత్రక నిర్మాణంగా రామప్పకు ఆ కీర్తి దక్కింది..167 దేశాల నుండి 1121 ప్రతిపాదనలు వచ్చాయి.. ఇందులో 255 ప్రతిపాదనలు యునెస్కో గుర్తింపు కోసం పోటీ పడ్డాయి.. వీటిలో మన దేశం నుండి గుజరాత్ లోని దోలవీరా తో పాటు, రామప్ప పోటీలో నిలిచాయి.

ఈనెల 16వ తేదీ నుండి వరల్డ్ హెరిటేజ్ బృందం యునెస్కో గుర్తింపు ప్రక్రియను ప్రారంభించాయి.. 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుంది.. కానీ రామప్పకు మధ్యలోనే ఈ ఘనత దక్కింది. చైనా లోని ఫ్యుజ్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో రష్యాతో పాటు 17దేశాలు రామప్ప దేవాలయానికి మద్దతు పలికాయి.

దీంతో ఆ అరుదైన ఘనత దక్కింది.. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించి.. ఈ అరుదైన కీర్తి ప్రతిష్టలు దక్కడం పట్ల జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హర్షం వ్యక్తం చేశారు… రామప్పకు ఈ కీర్తి ప్రతిష్టలు దక్కడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు..

రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పాత్రపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ఘనత దక్కడం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

Miracle Bore Water: ఆ బోరు వాటర్ తాగితే కీళ్ల నొప్పులు మాయం.. ఆ నీటి కోసం క్యూ కడుతున్న జనం..