AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు ఏనుగు.. చీమలు, దోమలంటే హడలిపోతుందని మీకు తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..

Facts About Elephant: ప్రంపచంలోనే అతిపెద్ద జంతువు ఏది అంటే టక్కున గుర్తొచ్చే పేరు ఏనుగు. మానవులతో అత్యంత సన్నిహితంగా..

ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు ఏనుగు.. చీమలు, దోమలంటే హడలిపోతుందని మీకు తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..
Elephants
Shiva Prajapati
|

Updated on: Jun 25, 2021 | 3:50 PM

Share

Facts About Elephant: ప్రంపచంలోనే అతిపెద్ద జంతువు ఏది అంటే టక్కున గుర్తొచ్చే పేరు ఏనుగు. మానవులతో అత్యంత సన్నిహితంగా మెలిగే జంతువులలో కుక్క తరువాత ఏనుగే అని చెప్పాలి. మనుషులకు, ఏనుగులకు మధ్య కెమెస్ట్రీని చూపించడానికి చాలా సినిమాల్లో ప్రయత్నాలు కూడా చేశారు. కాగా, ఏనుగులు భారీ కాయాన్ని కలిగిఉండటమే కాకుండా.. మంచి తెలివైనవి కూడా. అయితే, వాటికే గనుక కోపం వస్తే.. పరిస్థితి వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాంటి ఘటనలలో ఎంతో ప్రణాలు కూడా కోల్పోయారు. ఇదింతా పక్కన పెడితే.. ఇంతటి భారీ కాయం కలిగిన ఏనుగులు కేవలం చీమలు, దోమలు చూసి భయపడిపోతాయని మీకు తెలుసా?.. అదొక్కటే కాదు.. ఏనుగులకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం ఇక్కడ వివరిస్తున్నాం..

ప్రపంచ ఏనుగలందు.. ఆఫ్రికన్ ఏనుగు వేరయా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏనుగులు ఒక ఎత్తైతే.. ఆఫ్రికన్ ఏనుగులు ఒక ఎత్తు. మిగతా ఏనుగులకంటే ఆఫ్రికన్ ఏనుగుల పర్సనాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక మగ ఆఫ్రికన్ ఏనుగు కనీసంలో కనీసం 3 మీటర్ల ఎత్తు, 6 టన్నులు బరువు ఉంటుంది. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఒక మగ ఆఫ్రికన్ ఏనుగు.. సాధారణ అడవి ఏనుగు జీవితంలో సగం కాలం మాత్రమే జీవిస్తుంది. ఒక సాధారణ అడవి ఏనుగు జీవితకాలం 60 నుంచి 70 సంవత్సరాలు. కానీ ఆఫ్రికన్ ఏనుగు వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య మాత్రమే ఉంటుంది.

చాలా తక్కువ కంటి చూపు ఉంటుంది.. ఏనుగు కంటి చూపు చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రకాశవంతమైన కాంతిలో ఏనుగులు తక్కువగా చూడగలుగుతాయి. తక్కువ కాంతిలో ఎక్కువగా చూడగలుగుతాయి.

భారీ కాయం అయినప్పటకినీ.. వేగంగా నడవగలదు.. ఏనుగు బరువు 5,000 కిలోల కంటే ఎక్కువగానే ఉంటుంది. అంత బరువు ఉన్నప్పటికీ చాలా చురుకుగా ఉంటాయి. ఏనుగులు సాధారణంగా గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఒక ఏనుగు మొత్తం రోజులో సుమారు 10 నుండి 20 కిలోమీటర్లు నడుస్తుంది. ఇక వాటి నిద్ర కూడా విచిత్రమే. ఏనుగులు కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమ నిద్రపోతాయి. అది కూడా నిల్చొనే నిద్రపోతాయి.

చీమలు, దోమలు అంటే భయం.. ఇది వింతగా అనిపించినప్పటికీ.. ఏనుగులకు చీమలు, దోమలు, ఈగలు అంటే భయమట. అందుకే తొండాన్ని ముందుకు వెనక్కి కదిలిస్తుందట. ఏనుగు చర్మం ఒక అంగుళం అంత మందంగా ఉంటుంది. కానీ ఆ చర్మ చాలా సున్నితమైనది. చీమ, దోమ, ఇతర కీటకాలు కరిస్తే అక్కడ తీవ్రమైన గాయాలు అవుతాయి. అందుకే ఏనుగుకి దోమలు, చీమలు అంటే భయమని చెబుతారు.

ఏనుగు ఒకేసారి 8 లీటర్ల నీరు తాగుతుంది.. ఏనుగు తొండలంలో సుమారు 1,50,000 కండరాలు ఉంటాయి. ఏనుగు శరీర భాగాలన్నింటిలోకెల్లా తొండం చాలా సున్నితమైనది. ఆహారం తినడానికి గానీ, నీరు తాగడానికి గానీ ఏనుగులు తమ తొండాన్ని వాడుతాయనే విషయం తెలిసిందే. అయితే, ఏనుగు తన తొండంతో ఒకేసారి 8 లీటర్ల నీరు తాగుతుంది. ఇక అవి ఈత కొట్టే సమయంలో తొండం ద్వారా శ్వాసను తీసుకుంటాయి. ఇక ఏనుగు ఒక రోజులు 150 కిలోలకు పైగా ఆహారం తింటుంది.

పుట్టిన ఏనుగు గంటలోనే నడుస్తుంది.. అప్పుడే పుట్టిన గున్న ఏనుగు చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. గున్న ఏనుగు గురించి తెలియని షాకింగ్ విషయం ఏంటంటే.. అది పుట్టిన 20 నిమిషాల్లోనే లేచి నిలుచోగలదు. అలా గంటలోపే నడవగలదు కూడా. రెండు రోజుల తరువాత పూర్తి స్థాయిలో ఏనుగుల మందతో కలిసి కలియతిరుగుతుంది. ఆహారం, నీరు స్వయంగా సేకరించుకుంటుంది.

ఏనుగు చెవులను ఎందుకు ఊపుతుందంటే.. ఏనుగు శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుందట. ఆ కారణంగా ఏనుగులు తమ చెవులను నిరంతరం కదిలించడం ద్వారా శరీరంలోని వేడిని నియంత్రిస్తాయట. ఆఫ్రికన్ ఏనుగులకు అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగానే పెద్ద పెద్ద చెవులు ఉంటాయని టాక్. అయితే, ఈ విషయం ఏ శాస్త్రీయ అధ్యయనంలోనూ నిరూపించబడలేదు.

Also read:

Realme Smart TV: భార‌త్‌లో కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన రియ‌ల్‌మీ.. ప్రారంభ ఆఫ‌ర్ కింద రూ. 17,999 కే..