Treasure Hunt: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కొందరు ఆర్థికంగా స్థిమితంగా ఉన్నప్పటికీ.. మరికొందరు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. మూడు పూటలా భోజనం దొరకడమే కష్టమవుతోంది. కరోనా కారణంగా ఎంతో ప్రజలు నిరాశా, నిస్పృహలకు లోనవుతున్నారు. అయితే, ఈ పరిస్థితిని ఇష్టపడని ఇద్దరు యువకులు సరికొత్త గేమ్‌కు తెరలేపారు. సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల జీవితాల్లో కోస్తా ఆహ్లాదం, సంతోషంతో పాటు.. కొంత ఆర్థిక చేయూతను అందించేందుకు ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా సరికొత్త గేమ్ కు రూపకల్పన చేశారు.
అమెరికాకు చెందిన జాన్ మాగ్జిమ్, డేవిడ్ క్లీన్ ఇద్దరు స్నేహితులు. కరోనా పరిస్థితులతో విసిగి వేసారిపోయిన ఈ ఇద్దరు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని భావించారు. ఇందులో భాగంగా కొత్త గేమ్ ప్లాన్ వేశారు. అనుకున్నదే తడవుగా ఊటా కొండలలో 5,000 డాలర్లను దాచిపెట్టారు. ఈ డబ్బును ఎవరు కనిపెడితే, వారికే ఆ డబ్బు సొంతం అని ప్రకటించారు. అయితే, కరోనా కాలంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్త ఊరట, ఉల్లాసం అందించాలని ఈ గేమ్‌కు రూపకల్పన చేశారు. వారి తమ గేమ్ రూల్స్ ప్రకటించడం, కొందరు ఆ డబ్బు కోసం వెతులాడటం చకచకా జరిపోయాయి. ఈ ఇద్దరు దాచిన నిధిని కొందరు వ్యక్తులు కేవలం నాలుగు రోజుల్లోనే కనిపెట్టారు.
ఇదంతా గతేడాది జరుగగా.. ఈ ఏడాది 10వేల డాలర్లను దాచిపెట్టారు. వీటిని కనిపెట్టిన వారికే ఆ 10 వేల డాలర్లు ఇవ్వడం జరుగుతుందని జాన్, డేవిడ్ ప్రకటించారు. కాగా, దాచిన డబ్బును కనిపెట్టడంలో భాగంగా ప్రతీ శుక్రవారం వీరు సోషల్ మీడియా వేదికగా క్లూస్ విడుదల చేస్తున్నారు. ఈ నిధి కోసం అన్వేషణలో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా పాల్గొన్నట్లు డేవిడ్, జాన్ చెప్పారు. ఉటా మాత్రమే కాకుండా.. అలస్కా, హవాయి ప్రజలు కూడా ఈ గేమ్‌లో పాల్గొంటున్నారని చెప్పారు.
Also read:
Trouble With Sore Throat : గొంతు నొప్పితో ఇబ్బందా..! అయితే ఆపిల్ సైడర్ వెనిగర్‌తో ఇలా చేయండి..
Manjima Mohan: రిలేషన్షిప్ స్టేటస్ అడిగిన నెటిజన్… ఫన్నీగా ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్..