Steel Utensils: స్టీల్ పాత్రల్లో వంట చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ విషయాలను అస్సలు విస్మరించొద్దు..

|

Sep 11, 2022 | 7:45 AM

Steel Utensils: ప్రస్తుత కాలంలో చాలా మంది తమ తమ ఇళ్లలో వంటలు స్టీల్ పాత్రల్లో వంటలు చేస్తున్నారు. అల్యూమినియం పాత్రల వినియోగం తగ్గించి, స్టీల్ పాత్రల వినియోగం..

Steel Utensils: స్టీల్ పాత్రల్లో వంట చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ విషయాలను అస్సలు విస్మరించొద్దు..
Steel Bowls
Follow us on

Steel Utensils: ప్రస్తుత కాలంలో చాలా మంది తమ తమ ఇళ్లలో వంటలు స్టీల్ పాత్రల్లో వంటలు చేస్తున్నారు. అల్యూమినియం పాత్రల వినియోగం తగ్గించి, స్టీల్ పాత్రల వినియోగం ఎక్కువగా చేస్తున్నారు. దీనికి కారణం.. అల్యూమినియం పాత్రల్లో ఆహారాన్ని వండటం, తినడం వల్ల ఆరోగ్యానికి హానీ కలుగుతుందని జనాల్లో అవగాహన రావడమే. అయితే ఆహారాన్ని సరిగ్గా ఉడికించకపోతే, కొన్నిరకాల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోకపోతే స్టీల్ పాత్రలో వండినా కూడా అనేక విధాలుగా నష్టం జరుగుతుంది. అవును, స్టీల్ పాత్రల్లో వంటలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు పాటించడం వలన ఎలాంటి నష్టం జరుగకుండా ఉంటుంది. మరి స్టీల్ పాత్రల్లో వండాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అధిక మంట మీద ఆహారాన్ని ఉడికించొద్దు..

కొత్త స్టీల్ పాత్రల్లో ఎక్కువ మంట మీద ఆహారాన్ని ఎప్పుడూ వండొద్దు. వాస్తవానికి, స్టెయిన్‌లెస్ స్టీల్‌కు ఏ రకమైన టెఫ్లాన్ పూత ఉండదు. ఇది నిరోధకంగా ఉండేలా చేస్తుంది. అందువల్ల స్టీల్ పాత్రలో ఆహారాన్ని వండినప్పుడల్లా తక్కువ లేదా మధ్యస్థ మంటపై వండాలి.

ఇవి కూడా చదవండి

గ్రిల్ చేయవద్దు..

సన్నని స్టీల్ పాన్‌లో ఎప్పుడూ గ్రిల్ చేయకూడదు. గ్రిల్లింగ్ కోసం ఏదైనా పాత్రను ఎక్కువసేపు మంటపై ఉంచాలి. దాని కారణంగా మెటల్ దెబ్బతింటుంది.

డీప్ ఫ్రై చేయవద్దు..

స్టీల్ పాత్రలో ఏ ఆహారం కూడా డీప్ ఫ్రై చేయొద్దు. స్టీల్ పాత్రలకు స్మోక్ పాయింట్ ఉంటుంది. స్టీల్ పాత్రలో ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడల్లా, అది స్మోక్ పాయింట్‌కు మించి చేరుతుంది. దీని కారణంగా స్టీల్ పాత్ర పసుపు లేదా జిగటగా కనిపిస్తుంది. ఈ మరక అంత సులభంగా తొలగిపోదు.

మరిన్ని ఆఫ్‌బీట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..