Independence Day: ఆదివారం నాడు భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. 75 సంవత్సరాల క్రితం స్వతంత్రంగా మారిన భారతదేశానికి, ఇప్పటి భారతదేశానికి చాలా తేడాలు ఉన్నాయి. ఈ 75 సంవత్సరాలలో.. భారత్ ఒక కొత్త దేశంగా ముందుకు సాగుతోంది. ఈ 75 సంవత్సరాలలో భారతదేశం అనేక సవాళ్లను స్వీకరించింది. చాలా పురోగతిని సాధించింది. అయితే, నేటికీ భారతదేశంలో ద్రవ్యోల్బణంతో సహా అనేక సవాళ్లు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో.. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు, అప్పటి ద్రవ్యోల్బణం పరిస్థితి ఏంటి? అప్పుడు ధరలు ఎలా ఉన్నాయి? వంటి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 75 సంవత్సరాలలో నిత్యావసరాల ధరల్లో చాలా మార్పులు వచ్చాయి. గతంలో 1 రూపాయి కంటే తక్కువగా ఉండే వస్తువుల ధర నేడు 100 రూపాయలకు పైగా పెరిగింది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు మీ రోజువారీ వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి? నేడు వాటి రేటు ఎంత మారింది? మొత్తానికి నిత్యావసర వస్తువల ధరల్లో ఎంత మార్పు వచ్చింతో చూద్దాం.
ఎంత మారింది?
ఇప్పుడు మనం ఆ కాలపు రేట్లను పోల్చి చూస్తే, అప్పుడు వస్తువుల ధరలు దాదాపు 100 శాతం పెరిగాయి. ఇంతకు ముందు కొన్ని పైసలకు లభించే వస్తువులను.. ఇప్పుడు కొనాలంటే 100 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇంకా ప్రత్యేక విషయం ఏంటంటే.. పెట్రోల్, బంగారం, వెండి ధరల్లో ఊహించని విధంగా మార్పు వచ్చింది.
1. పెట్రోల్ ధర చూసుకున్నట్లయితే.. 1947 సంవత్సరంలో పెట్రోల్ లీటర్ 0.27 రూపాయలకు అందుబాటులో ఉండేది. ఇప్పుడు దాని ధర ఏకంగా రూ. 100కు పైగానే ఉంది.
2. 1947 సంవత్సరంలో ఒక వార్తాపత్రిక 0.13 రూపాయలకు వచ్చేది. కానీ ఇప్పుడు దాని ధర 5 రూపాయలు.
3. అదే సమయంలో ఢిల్లీ నుంచి ముంబైకి విమాన టిక్కెట్ల ధరలను పరిశీలించినట్లయితే.. అప్పుడు 140 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు దాని ధర 8 నుంచి 10 వేల రూపాయలుగా ఉంది.
4. ఇంతకుముందు సినిమా టిక్కెట్ రూ. 0.30 గాఉంటే.. ఇప్పుడు దాదాపు రూ .250 గా ఉంది.
5. ఇక పాల పరిస్థితి కూడా అలాగే మారింది. గతంలో లీటరు రూ. 0.12 కి పాలు లభించేవి, కానీ నేడు ఒక లీటరు పాలకు రూ .60 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.
5. బంగారం ధర పరిశీలించినట్లయితే.. 1947లో 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయల కంటే తక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు బంగారం ధర 50 వేల రూపాయలకు చేరుకుంది.
ఏదేమైనా, 75 సంవత్సరాల తర్వాత నేడు భారతదేశ స్వరూపం అన్నివిధాలుగా చాలా మారిపోయింది. భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి చెందింది. నేడు భారతదేశం అనేక రంగాలలో కొత్త ఎత్తులలో ఉంది. ఈ కారణంగా, భారతదేశం ప్రపంచంలోని ఇతర దేశాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది.
Also read:
CM Jagan: రేపు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం పర్యటన.. జగనన్న విద్యాకానుక కింద పిల్లలకు కిట్లు పంపిణీ