War for Watermelon: రాజుల కాలంలో రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేయడం విన్నాం.. ఖజానా కోసం యుద్ధాలు జరగడం విన్నాం.. ఆఖరికి అమ్మాయిల కోసం రెండు రాజ్యాల మధ్య పోరాటం జరగడం కూడా తెలుసు. కానీ, ఒక పండు కోసం రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగిందనే విషయం మీకు తెలుసా? ఒక పండు కోసం వేలాది మంది ప్రాణాలు కోల్పోయరనే విషయం తెలుసా? తెలియకపోతే.. ఈ కథనం తెలుసుకోండి..
అవును మీరు చిదివింది నిజమే. ఒక పుచ్చపండు కారణంగా భీకర యుద్ధం జరిగింది. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పుచ్చకాయను మతిరా అని పిలుస్తారు. ఈ యుద్ధం క్రీ.శ. 1644 లో జరిగింది. బికనీర్ రాజ్యంలోని సరిహద్దు గ్రామం సిల్వాలో పుచ్చకాయ చెట్టు మొలకెత్తింది. అయితే, తీగ జాతి అయిన ఈ పుచ్చకాయ చెట్టు.. నాగౌర్ సంస్థానంలోని పరిహద్దు గ్రామమైన జఖానియన్‌లో పెరిగింది. ఈ కారణంగా ఈ చెట్టుకు కాసిన తమకు చెందినవని సిల్వా గ్రామ ప్రజలు అంటే.. లేదు లేదు ఈ చెట్టు పండ్లు మాకు చెందినవి అని నాగౌర్ ప్రజలు డిమాండ్ చేశారు. ఇలా ఈ చెట్టుకు కాసిన పుచ్చకాయ కోసం ఘర్షణ మొదలైంది.
రాజులకు యుద్ధం గురించి తెలియదు..
చిన్నగా మొదలైన ఈ ఘర్షణ.. రెండు రాజ్యాల మధ్య యుద్ధానికి దారి తీసింది. నెత్తురు కళ్లజూసింది. ఈ యుద్ధంలో బికనీర్ సైన్యానికి రామచంద్ర ముఖియా నాయకత్వం వహించగా. నాగౌర్‌కు సింఘ్వి సుఖ్మల్ నాయకత్వం వహించాడు. ఈ ఇద్దరి నాయకత్వంలో భీకర పోరాటం జరిగింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ యుద్ధం గురించి ఇరు రాజ్యాల రాజులకు తెలియకపోవడం. కాకపోతే చాలా ఆలస్యంగా ఈ యుద్ధం గురించి రాజులకు సమాచారం చేరింది. దాంతో వారు మొఘల్ కోర్టు జోక్యం చేసుకోవాలని ఇరు రాజ్యాల రాజులు కోరారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ యుద్ధం వ్యవహారం మొఘల్ కోర్టుకు రాకముందే ముగిసింది. ఈ యుద్ధంలో నాగౌర్ సంస్థానం ఓడిపోయినప్పటికీ.. ఇరు వైపులా వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్ర పుటలు చెబుతున్నాయి.
Also read:
Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్క రోజులో 18 చిన్నారులకు సోకిన మహమ్మారి..
Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. పేలిన సిలిండర్.. 17 మందికి తీవ్ర గాయాలు..