చాణక్యనీతి: ఒక వ్యక్తిని కాల్చడానికి అగ్ని అవసరం లేదు.. ఈ 5 విషయాలు చాలంటున్న ఆచార్య చాణక్య..

చాణక్యనీతి: ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే గ్రంథంలో కాలానికి సంబంధించిన అనేక విషయాలను రాశారు. ఇది అతడి దూరదృష్టిని రుజువు చేస్తుంది. ఆచార్య చాణక్య గొప్ప పండితుడు,

చాణక్యనీతి: ఒక వ్యక్తిని కాల్చడానికి అగ్ని అవసరం లేదు.. ఈ 5 విషయాలు చాలంటున్న ఆచార్య చాణక్య..
Acharya Chanakya

Updated on: Oct 29, 2021 | 8:35 AM

చాణక్యనీతి: ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే గ్రంథంలో కాలానికి సంబంధించిన అనేక విషయాలను రాశారు. ఇది అతడి దూరదృష్టిని రుజువు చేస్తుంది. ఆచార్య చాణక్య గొప్ప పండితుడు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుడు, ఆర్థికవేత్త, సామాజికవేత్త, రాజకీయవేత్త. మొత్తం నంద వంశాన్ని సర్వనాశనం చేసి ఒక సాధారణ పిల్లవాడిని చక్రవర్తిగా చేసిన గొప్ప మేధావి. అతను జీవితాంతం మౌర్య రాజవంశం వ్యవస్థాపకుడిగా, పోషకుడిగా కొనసాగారు. ఆచార్య తన నీతి శాస్త్రం అనే పుస్తకంలో అనేక విషయాలను ప్రస్తావించారు. నేటి కాలంలో అన్ని సమస్యలకు ఇందులో పరిష్కారం లభిస్తుంది. చాణక్య ఒక వ్యక్తిని కాల్చడానికి అగ్నియే అవసరం లేదు చాలా విషయాలు చంపేస్తాయని చెబుతున్నాడు. పరిస్థితులు చాలా ప్రమాదకరమైనవి అవి ఒక వ్యక్తిని లోపల నుంచి దహిస్తాయని చెప్పాడు. ఆ విషయాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. భార్య నుంచి విడిపోవడం
భార్యాభర్తలు రథానికి రెండు చక్రాలు. ఇద్దరికీ ఒకరికొకరు చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో భార్య భర్తకు దూరమైతే ఆ బాధ వర్ణణాతీతం. అలాంటి వ్యక్తి లో లోపల చాలా బాధపడుతాడు. జీవితం పట్ల అతని వైఖరి పూర్తిగా ఉదాసీనంగా మారుతుంది.

2. స్వంత వ్యక్తులచే అవమానం
సొంత వ్యక్తులచే అవమానపడటం కంటే దారుణం మరోటి ఉండదు. పదే పదే అవమానాలు చవిచూస్తూ బతకడం చాలా కష్టం. అలాంటి వ్యక్తి చాలా ఉక్కిరిబిక్కిరి అవుతాడు. జీవితం భారంగా అనిపిస్తుంది.

3. రుణం
అప్పు అనేది మనిషికి పెనుభారం. ఈ భారంలో కూరుకుపోయిన వ్యక్తి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేడు. జీవితాన్ని ప్రశాంతంగా గడపలేడు. ప్రతి క్షణం అతనికి బాధాకరమే.

4. నచ్చని వారికి సేవ చేయడం
నచ్చని వారికి సేవ చేయడమంటే అది నరకంలాంటిది. లోలోపల అతడు దహించిపోతాడు. ఇష్టం లేని పని చేస్తూ ఎవరికి చెప్పుకోలేక కలవరపడుతాడు.

5. పేదరికం
ఆచార్య చాణక్యుడు స్వయంగా పేదరికాన్ని శాపంగా భావించాడు. పేదరికం ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది. అన్నీ పొందేందుకు జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది.

Custard Apple: సిరులు కురిపిస్తున్న సీతాఫలం.. 6 ఎకరాల బంజరు భూమిలో 40 లక్షల పంట..

Varudu Kavalenu Twitter Review: వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ.. నాగశౌర్య సినిమా ఎలా ఉందంటే..

Third Wave in India: థర్డ్‌వేవ్ ముంగిట భారత్.. పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు..