Scorpion Venom: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విషం.. ఇది మానవులకు వరం.. ఎందుకో తెలిస్తే మీరే షాకవుతారు..

|

Apr 08, 2021 | 11:39 AM

Poison - Scorpion Venom: ఆధునిక ప్రపంచంలో సైన్స్ బాగా అభివృద్ధి చెందింది. అంతకుముందు మానవులకు ఎలాంటి రోగాలు వచ్చినా.. ఏమైనా జరిగినా.. మొక్కలు, ఆకులు, అలములను

Scorpion Venom: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విషం.. ఇది మానవులకు వరం.. ఎందుకో తెలిస్తే మీరే షాకవుతారు..
Scorpion Venom
Follow us on

Poison – Scorpion Venom: ఆధునిక ప్రపంచంలో సైన్స్ బాగా అభివృద్ధి చెందింది. అంతకుముందు మానవులకు ఎలాంటి రోగాలు వచ్చినా.. ఏమైనా జరిగినా.. మొక్కలు, ఆకులు, అలములను ఔషధాలుగా వినియోగించేవారు. అయితే సైన్స్‌ అభివృద్ధి చెందిన తర్వాత హాని కలిగించే వినాశక కీటకాలు, విష జంతువుల విషం నుంచే మానవులకు చికిత్స చేయడం మొదలుపెట్టారు. అయితే అలాంటి విషాల్లో తేలు విషం ఒకటి. తేలు విషం మానుషులకు వరం. ఇది అత్యంత ఖరీదైన ద్రవాల్లో ఒకటిగా పరిగణిస్తారు. దీని ధర కోట్లల్లో ఉంటుంది. విష జీవులు వల్ల నిత్యం చాలామంది మరణిస్తున్నారు. అలాంటి విషమే ప్రజలకు వరంగా మారుతుందని పేర్కొంటున్నారు శాస్త్రవేత్తలు.

తేలు విషం ప్రయోజనాలు..

తేలు చాలా ప్రమాదకరమైనది.. దీనిలో ఉండే కొంచెం విషమే ప్రజలకు హాని కలిగిస్తుంది. చాలా సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతాయి. తేలు ఎరను పట్టుకోవడానికి లేదా తన శత్రువు నుంచి తనను తాను రక్షించుకోవడానికి విషాన్ని ఉపయోగిస్తుంది. అలాంటి విషం మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ విషంలో అంత ప్రత్యేకత ఏమున్నదనే ప్రశ్న తలెత్తవచ్చు. ఈ తేలు విషంలో అధిక మొత్తంలో ప్రోటీన్, పలు రకాల ఔషధాలలో ఉపయోగించే కీలక రసాయనాలు ఉన్నాయి. ఇది ఆర్థరైటిస్, జీర్ణ వ్యవస్థ వ్యాధులకు చికిత్స చేయడంలో కీలకంగా పనిచేస్తుంది.

విషం ఎలా తీస్తారంటే..?

తేలు విషాన్ని చాలా జాగ్రత్తగా తీస్తుంటారు. చిన్న చిన్న విద్యుత్ షాక్‌లు ఇస్తూ విషాన్ని బయటకు తీస్తారు. దీనివల్ల పెద్ద మొత్తంలో విషం బయటకు వస్తుంది. విషం తీసేటప్పుడు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ విషం అంతర్జాతీయ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు. స్కార్పియన్ పాయిజన్‌లో ఐదు లక్షల రసాయన సమ్మేళనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతుంటారు. అందుకే దీనిని కాక్టెయిల్ ఆఫ్ బయోయాక్టివ్ కాంపౌండ్ అని పిలుస్తుంటారు.

Also Read:

Summer Diet Tips: వేసవిలో ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండండి.. లేకపోతే అనారోగ్యం బారిన పడ్డట్లే..

Tips to Stop Snoring: గురక సమస్య వేధిస్తుందా… ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో తగ్గించుకోండి ఇలా..!