Viral News: థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవ్… ఆమె పోగొట్టుకున్న బిడ్డే, తనయుడి పక్కన పెళ్లికూతురిగా

| Edited By: Team Veegam

Apr 07, 2021 | 2:59 PM

ఈ ఆర్టికల్‌లో సినిమాను మించిన ట్విస్టులు ఉన్నాయి. తెలుగు హీరో అడవి శేష్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల మాదిరి.. మీరు ఆ ట్విస్టులను కనీసం గెస్ కూడా చెయ్యలేరు.

Viral News: థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవ్... ఆమె పోగొట్టుకున్న బిడ్డే, తనయుడి పక్కన పెళ్లికూతురిగా
Wedding day twist
Follow us on

ఈ ఆర్టికల్‌లో సినిమాను మించిన ట్విస్టులు ఉన్నాయి. తెలుగు హీరో అడవి శేష్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల మాదిరి.. మీరు ఆ ట్విస్టులను కనీసం గెస్ కూడా చెయ్యలేరు. తనయుడి పెళ్లిలో ఓ మహిళకు ఓ ఊహించని విషయం తెలిసింది. 20 ఏళ్ల కిందట తాను పొగొట్టుకున్న బిడ్డే.. ఇప్పుడు పెళ్లి కుమార్తెగా తన ముందుకు వచ్చిందని ఆమె కనిపెట్టేసింది. ఆ ఈ విషయం గుర్తించడానికి ప్రధాన కారణం పెళ్లి కూతురు శరీరంపై ఉన్న పుట్టుమచ్చ. అవును ఆ పుట్టుమచ్చ చూడగానే వరుడి తల్లికి డౌట్ వచ్చింది. వెంటనే ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లి.. ప్రశ్నల వర్షం సంధించింది. వారు తొలుత తటపటాయించినా.. తర్వాత ఓపెన్ అయిపోయారు. తమకు దొరికిన బిడ్డను పెంచి, పెద్ద చేశామని అసలు విషయం తేల్చేశారు. దీంతో పెళ్లికూతురు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ సుజోలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

20 ఏళ్ల కిందట ఓ చిన్నారి రోడ్డు పక్కన ఏడుస్తుండగా తాము గమనించి ఆమెను సదరు దంపతులు పెంచి పెద్ద చేశారట. ఈ విషయం ఆమెకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. ఈ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.  ఇప్పుడు ఆ అమ్మాయి వివాహం తన అన్నతోనే నిశ్చయమైనట్లు కదా. అంతా తెలిశాక పెళ్లి ఆగిపోవాలి కదా.. కానీ యథావిధిగా జరిగింది. అరె ఇదేంటి.. చైనా వాళ్లకు బంధాలు, విలువలు పట్టవా అనే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. అతడు ఆమె సొంత కొడుకు కాదట.  కన్నబిడ్డను కోల్పోయిన బాధలో.. కొన్నాళ్లు గాలింపు చేసిన ఆ తల్లి.. చివరకు  ఓ మగబిడ్డను దత్తత తీసుకుని పెంచుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న వరుడు.. ఆమెకు సొంత కొడుకు కాదు.  అందువల్ల తన కన్నకూతురు అతడిని పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమి లేదని సదరు మహిళ భావించింది.  అందరికీ నచ్చజెప్పి యధావిధిగా పెట్టిన ముహూర్తానికే వారి పెళ్లిని జరిపించింది.

Also Read: ఆంధ్రాలో ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి.. కొత్తగా నమోదైన కేసులు, మరణాల వివరాలు

తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు… హైదరాబాద్‌లో బీర్లకు ఫుల్ డిమాండ్.. రికార్డ్ లెవల్ సేల్స్