King Mswati III Swaziland: ఈ రాజు ఏడాదికి ఒక కన్యను పెళ్లి చేసుకుంటాడు.. ఇప్పటికి 15 మంది భార్యలు.. ఇంకా

|

Apr 09, 2021 | 4:52 PM

ప్రపంచంలో చాలా కాలం క్రితం రాచరిక వ్యవస్థ రద్దు చేయబడిందని మనందరికీ తెలుసు. దీనికి కారణం రాజులు పెట్టిన వింత నియమాలు, తీసుకొచ్చిన నియంత చట్టాలు.

King Mswati III Swaziland: ఈ రాజు ఏడాదికి ఒక కన్యను పెళ్లి చేసుకుంటాడు.. ఇప్పటికి 15 మంది భార్యలు.. ఇంకా
Mswati Iii
Follow us on

ప్రపంచంలో చాలా కాలం క్రితం రాచరిక వ్యవస్థ రద్దు చేయబడిందని మనందరికీ తెలుసు. దీనికి కారణం రాజులు పెట్టిన వింత నియమాలు, తీసుకొచ్చిన నియంత చట్టాలు. అయితే ఆఫ్రికాలోని ఒక దేశంలో ఇప్పటికీ రాజరికమే నడుస్తుంది. రాజే ఆ దేశాన్ని పరిపాలిస్తాడు. ఆ దేశం పేరు స్వాజీలాండ్. ఈ దేశం ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికాతో కలిసి ఉంది.  ఇది దక్షిణ ఆఫ్రికాలో ఒక భూబంధిత దేశం.  2018 లో  దేశానికి స్వాతంత్య్రం లభించి 50 సంవత్సరాలు పూర్తయిన తరువాత, ఇక్కడి రాజు దేశం పేరును ఈస్వాటిని సామ్రాజ్యంగా మార్చారు. ఇక్కడ ఉన్న ఓ విచిత్రమైన సాంప్రదాయం గురించి తెలుస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ఇక్కడ ఓ  ప్రత్యేక పండుగ ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో జరుగుతుంది..

దీనిని రహస్యాలు నిండిన దేశం అని కూడా పిలుస్తారు. ఈ దేశం ప్రకృతిలో చాలా అందంగా ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ‘ఉమ్లంగా సెరెమణి’ అనే పండుగ ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ‘క్వీన్స్ తల్లి లుడ్జిగిని రాజ’ గ్రామంలో జరుగుతుంది. ఇందులో 10,000 మందికి పైగా కన్యలు పాల్గొంటారు. వారిలో ఒక యువతిని రాజు పెళ్లాడతాడు. ఈ తంతు ప్రతి ఏడాది జరుగుతుంది. ప్రస్తుతం ఆ దేశాన్ని మూడవ మస్వతి పరిపాలిస్తున్నారు. ఇప్పటికి అతడికి 15 మంది భార్యలు ఉన్నారు.

ఇదే కాకుండా, ఈ దేశంలో ప్రజలు పేదరికంతో బ్రతుకుతున్నప్పటికీ.. వారిని పట్టించుకోకుండా రాజు  మాత్రం విలాసవంతమైన జీవనం సాగిస్తాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ దేశం యొక్క మొత్తం జనాభా సుమారు 13 లక్షలు. కాగా ఇక్కడ 63 శాతం మంది ప్రజలు ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. కడుపునిండా ఆహారం తినడానికి, బట్టలు ధరించడానికి కూడా స్థోమత లేని స్థితిలో అక్కడి చాలా ప్రాంతాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కానీ ఇక్కడి రాజుకు బిలియన్ల ఆస్తి ఉంది. ఈ ఆస్తి రోజు రోజుకు పెరుగుతోంది.

Also Read: వానరాలే వారి అస్త్రం.. కోతులతో మాయ చేసి లీలగా దోచేస్తారు.. జర భద్రం గురూ 

షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం, నాలుగు వాహనాలు ఢీ కొని పలువురికి గాయాలు.!