జాతరో.. జాతర! పేరెంతో రమణీయం.. చరిత్ర అంతకు మించిన కమనీయం. ఆనాటి ఆనవాళ్లకి సాక్షీభూతం మేళ్లచెరువు

|

Mar 12, 2021 | 7:25 PM

Mellacheruvu Shambhu Lingeswara Temple : నింగి నుంచి నేలపైకి వేగంగా దూసుకొస్తున్న గంగను కొప్పులో ఒడిసిపట్టి, మెల్లంగ నేలపైకి జారవిడుస్తాడు శివుడు. లోకాలను రక్షించడం..

జాతరో.. జాతర! పేరెంతో రమణీయం.. చరిత్ర అంతకు మించిన కమనీయం. ఆనాటి ఆనవాళ్లకి సాక్షీభూతం మేళ్లచెరువు
Mella Cheruvu
Follow us on

Mellacheruvu Shambhu Lingeswara Temple : నింగి నుంచి నేలపైకి వేగంగా దూసుకొస్తున్న గంగను కొప్పులో ఒడిసిపట్టి, మెల్లంగ నేలపైకి జారవిడుస్తాడు శివుడు. లోకాలను రక్షించడం కోసం పరమభయంకరమైన విషాన్ని పాయసంలా తాగుతాడు. అసురుడైన రావణుడి కోరికమేరకు ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. లోకకల్యాణం కోసం త్రిపురాసురులను సంహరించినవాడే ఆ పరమాత్ముడు. మహాశివుడు కొలువైన ప్రతి క్షేత్రం మహాశివరాత్రి సందర్భంగా భక్తజన సందోహంతో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా వాడపల్లి కృష్ణానదీ తీరంలో ఆవిర్భవించి అగస్త్యేశ్వరుడు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అయితే, ఇక్కడ శివలింగం శిరోభాగం నుంచి అదేపనిగా నీరు వస్తూ ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శైవక్షేత్రాలు చాలానే ఉన్నాయి. వీటిలో మేళ్లచెరువు మండల కేంద్రంలో ఉన్న శంభు లింగేశ్వర స్వామి ఆలయం ప్రశస్తమైనది.

11వ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటి యాదవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలోని శివశంకరుడి లీలలు భలే గమ్మత్తుగా ఉన్నాయి. ఈ శైవక్షేత్రానికి ప్రాముఖ్యతతో పాటు పెద్ద కథే ఉంది. కాకతీయుల కాలంలో క్రిస్మస్ నది పరివాహక ప్రాంతంలో కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతుండే వారు. శివుడు ఇక్కడి ప్రజల కష్టాలను చూసి చలించిపోయాడు. వారిని ఆ కష్టాల నుంచి దూరం చేసేందుకు శివుడు హన్మకొండ వేయి స్తంభాల గుడి నుంచి వచ్చి మేళ్లచెరువు అటవీ ప్రాంతంలో వెలిశాడు. ఈ ప్రాంతంలో ఉన్న యాదవ రాజుల పాలనలో ఆవులమంద ఎక్కువగా ఉండేది. అటవీ ప్రాంతంలో వెలసిన శివుడికి ఓ ఆవు నిత్యం పొదుపు ద్వారా పాలు ఇచ్చేది. దీన్ని గమనించిన యాదవరాజు శివలింగాన్ని 11 సార్లు గొడ్డలితో నరికి పదకొండు ప్రాంతాల్లో వేశాడట. అయినా తెల్లారేసరికి శివలింగం ఈ స్థితిలో ఉండేదట. గంగబోయిన మల్లన్న అనే యాదవరాజుకు కలలోకి వచ్చిన ఈశ్వరుడు.. ఈ ప్రాంతం దక్షిణ కాశీగా విరాజిల్లుతుందని చెప్పడంతో 1126లో ఈ ఆలయాన్ని నిర్మించారు. స్వయంభువుగా వెలసిన శంభు లింగేశ్వర స్వామి పెరుగుతూ వస్తున్నాడు. ఇక్కడి శివలింగానికి ఓ ప్రత్యేకత ఉంది. పైభాగంలో గంగా ఉంటుంది. ఎంత తీసినా ఇంకా నీరు ఊరుతూనే ఉంటుంది. ఎంతో ఎత్తున ఉండే ఈ ఆలయంలోని శివలింగం నుంచి నీరు ఊరడం భక్తులను విస్మయానికి గురి చేస్తోంది.

కాణిపాకం వినాయకుడి ఆకారం జరిగినట్లు.. ఇక్కడ లింగం పెరుగుతోందని భక్తులు విశ్వసిస్తున్నారు. అప్పట్లో మూడు బొట్లు పెట్టే సైజులో ఉన్న లింగం.. ప్రస్తుతం సైజు పెరిగిందని భక్తులు చెబుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శివలింగం పాణవట్టంతో కలిసి ఉంటుంది. శివలింగానికి పాణవట్టం రెండు ప్లేట్లుగా ఉంటుంది. శివలింగమైన భూమిని ఆనుకొని పాణవట్టంతో ఉంటుంది. శివలింగం ప్రతీ ఆరవై ఏళ్లకోసారి ఒక అంగుళం పెరుగుతుందని భక్తులు చెబుతుంటారు. మేళ్లచెరువులో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు గత 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా వస్తున్నానని చెప్పారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక, శివరాత్రి సందర్భంగా.. కొత్త శోభను సంతరించుకున్నాయి శైవక్షేత్రాలు. అయితే మేళ్లచెరువుది అందులోనూ మరి స్పెషల్. పుట్టినప్పటి నుంచి ఇక్కడకు క్రమం తప్పకుండా వస్తున్న అనేకమంది భక్తులు పరమేశ్వరుడి సేవలో తరిస్తుంటారు.

Read also : Trump Buddha Statues: అధ్యక్ష పదవి పోయినా చైనాలో ట్రంప్.. ట్రంపే.. కూర్చోబెట్టి మరీ మార్కెట్లో అమ్మేస్తోన్న డ్రాగన్ కంట్రీ