ఆ ప్రాంతానికి వెళితే మాటాషే.. 2000 ఓడలు, 75 విమానాలు మాయం.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం..

ఈ ప్రపంచంలో వింతలు, అద్భుతాలు అనేకం ఉన్నాయి. మనకు తెలియని జీవరాశులు.. ప్రదేశాలు కోకొల్లలు. ఇక మానవుడికి అంతుచిక్కని రహస్యాలు..

ఆ ప్రాంతానికి వెళితే మాటాషే.. 2000 ఓడలు, 75 విమానాలు మాయం.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం..
Bermuda

Updated on: Jul 09, 2021 | 9:54 AM

ఈ ప్రపంచంలో వింతలు, అద్భుతాలు అనేకం ఉన్నాయి. మనకు తెలియని జీవరాశులు.. ప్రదేశాలు కోకొల్లలు. ఇక మానవుడికి అంతుచిక్కని రహస్యాలు.. ప్రదేశాలు.. వింతలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే మన భూమ్మీద.. మానవులతోపాటు.. దెయ్యాలు, ఆత్మలు, అతీత శక్తులు కూడా ఉన్నాయని చాలా వరకు వింటుంటాం. ఇక కొన్ని ప్రాంతాలను ఇవి తమ ఆవాసంగా మార్చుకుని నివసిస్తుంటాయని… పొరపాటున అక్కడికి వెళితే ఇక మరణం తధ్యమని అంటుంటారు. ఇప్పుడు అలాంటి ప్రదేశం గురించి ఇటీవల కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అక్కడికి వెళ్లినవారు ఇప్పటికీ తిరిగి రాలేదట. దాదాపు 2000 ఓడలు, 75 విమానాలు అదృశ్యం అయ్యాయని.. అక్కడ దెయ్యాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఆ ప్రాంతం ఎక్కడుందో తెలుసుకుందామా.

బెర్ముడా ట్రయాంగిల్.. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం తీర ప్రాంతం. దీనిని “డెవిల్స్ ట్రయంగిల్” అని కూడా అంటారు అంటే సాతానికి ట్రాయంగిల్. అయితే మానవుడు సైన్స్ పరంగా ఎంతో ముందుకు వెళ్లిన.. ఇప్పటికీ చేధించలేని రహాస్యాలు ఎక్కువగానే ఉన్నాయి. యూకెలోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రాంత రహస్యాన్ని చేధించినట్లుగా పేర్కోన్నారు. ఈ ప్రాంతానికి వెళ్లిన ఓడలు, విమానాలు ఇప్పటికీ వరకు ఆచూకీ లేకుండా పోయాయి. దీంతో అక్కడ ఎవరైనా గ్రహాంతర వాసులు ఉన్నారా ? లేదా అతీతశక్తులు ఉన్నాయా ? అనే అనుమానాలను వ్యక్తం చేసాు. బ్రిటిష్ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. “రోంగ్ వేవ్” కారణంగా బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ప్రమాదాలు సంభవిస్తుంటాయని అంటుంటారు. ఈ తరంగాలు 100 అడుగుల వరకు ఉంటాయని.. అందుకే అక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయని తెలిపారు.

ఆంగ్ల దిన పత్రిక 5 డాక్యుమెంటరీ “ది బెర్ముడా ఎనిగ్మా” లో సీక్రెట్స్ ఆఫ్ ది బెర్ముడా ట్రయాంగిల్ అనే సమాచారన్ని ప్రచురించారు. రోగ్ వేవ్ పవిషయానికి వస్తే.. ఇక్కడ 1997లో దీనిని ఉపగ్రహ సాయంతో గుర్తించారు. 1918లో అమెరికాకు చెందిన యుద్ధనౌక బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 300 మంది చనిపోయారు. అయితే శాస్త్రవేత్తలు ఓడ నమునా సాయంతో ప్రమదాలకు గల కారణాలను గుర్తించారు. బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతం దాదాపు మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాలను కలిపిన అంతకంటే ఎక్కువగా పరిమాణంలో ఉంటుందని గుర్తించారు. ఇది అత్యంత భయంకర ప్రాంతామని.. అనేక ప్రమాదాలు జరుగుతుంటాయని పురాతన పత్రాలలో పొందుపరిచినట్లుగా గుర్తించారు.

సహజ, భౌగోళిక, ఇతర కారణాలతో అట్లాంటిస్ నగరం కనుమరుగైందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏదైనా ఓడ, విమానం ఈ ప్రాంతం దగ్గరకు వెళ్లిన తిరిగి రాదు. అయితే వాటికి సంబంధించిన శిధిలాలు కూడా అక్కడ కనిపించవు. ఇందుకు కారణం ఈ ప్రాంతానికి దగ్గర ప్రవహించే బలమైన తరంగమని.. ఇది శిధిలాలను తీసుకెళ్తుందని అంటుంటారు. దాదాపు 1000 సంవత్సరాలలో ఇక్కడ 1000 మరణించినట్లుగా చెబుతుంటారు. అంటే ప్రతి సంవత్సరం నాలుగు విమానాలు, 20 నౌకలు తప్పిపోతుంటాయి. 1945లో యుఎస్ నావికాదళానికి చెందిన ఐదు అవెంజర్ టార్పెడో బాంబర్లు 90 నిమిషాల్లోనే అదృశ్యమయ్యాయి. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్ నుంచి 14 మంది ప్రయాణికులతో వెళ్లిన విమానం.. కాసేపటికి కనుమరుగైంది. ఇప్పటికీ ఈ ప్రాంతంకు సంబంధించిన రహస్యం అలాగే ఉంది.

Also Read: Sepoy Jaswanth Reddy: మరో నెల రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే విషాదం.. జమ్మూకశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో తెలుగు జవాన్ వీర మరణం..!