వికారాబాద్ జిల్లాలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావడంలేదు. కోళ్లు, కాకులు ఉన్నట్లుండి గిలగిల కొట్టుకుంటూ నేల రాలుతున్నాయి. ఈ వింత వ్యాధి ఏంటో తెలియక జనం తలలు పట్టుకుంటున్నారు. ఈ ఘటనలు వికారాబాద్ జిల్లా దారూర్ మండలం దోర్నాల గ్రామంలో కలవరపరుస్తున్నాయి. రెండ్రోజులుగా గ్రామంలో అంతుచిక్కని వ్యాధి జనానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. అయితే ఇది బర్డ్‌ఫ్లూ కాదని తెలుస్తోంది. ఎందుకంటే.. అక్కడ కుక్కలు కూడా చనిపోతున్నాయి. దీంతో ఏంటీ వింత అనుకుంటున్నారు స్థానికులు.
పిట్టల్లా రాలిపోవడం అంటే ఏంటో.. ఆ గ్రామంలో కనిపిస్తోంది. కాకులు ఉన్నట్లుండి నేలన పడుతున్నాయి. నాటు కోళ్లు గిలగిల కొట్టుకుని ప్రాణాలు వదులుతున్నాయి. గ్రామం మొత్తం ఇదే గోల. ఇప్పటికే అధికారులకు సమాచారం అందించారు. నాటుకోళ్లకే ఈ వింత వ్యాధి సోకుతోంది. ప్రస్తుతం వాటిని ల్యాబుకు పంపారు. వాటికి సోకిన వ్యాధి ఏంటో తేల్చబోతున్నారు. ఏం రోగమో తెలియదు. కాని కోళ్లు, కాకులు చస్తున్నాయి. వెటర్నరీ డాక్టర్లు.. ల్యాబులే తేల్చాలి.