Maggie Ice Cream Roll: ఇటీవల కాలంలో నిత్యం ఎన్నో రకాల వంటలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వింత వంటలు చూసి.. ఆహార ప్రియులే వామ్మో అంటూ నోరెళ్లబెట్టారు. చాక్లెట్ సమోసా.. టమోటా కచోరి, ఐస్ క్రీం కచోరి, వెజ్ ఫిష్ ఫ్రై, పచ్చి మిర్చి హల్వా, కొత్తిమీర ఐస్‌క్రీం, ఫాంట మ్యాగీ ఇలా ఒక్కటేమిటీ.. ఎన్నో ఆహార పదార్థాలు నెట్టింట వైరల్ అయ్యాయి. కొందరు చేస్తున్న ఈ ప్రయోగాలను చూసి నెటిజన్లు ఇదేం పోయే కాలం రా.. అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే మరో సరికొత్త వంటకం ట్రెండ్ (Trending) అవుతోంది. అదే మ్యాగీ ఐస్‌క్రీమ్ రోల్. ఈ ప్రయోగాన్ని చూసి మ్యాగీ, ఐస్‌క్రీం ప్రియులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మ్యాగీ ఐస్ క్రీమ్ రోల్ వీడియోను చూసి నెటిజన్లు పలు రకాలుగా రియాక్షన్‌లు ఇస్తున్నారు. తాజాగా నెట్టింట మ్యాగీ ఐస్‌క్రీం రోల్‌ను తయారు చేస్తున్న అలాంటి వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మ్యాగీని ఐస్‌క్రీమ్‌తో కలిపి రోల్స్ తయారు చేస్తున్నారు. ‘మ్యాగీ ఐస్‌క్రీమ్ రోల్’ రెసిపీ వీడియో వైరల్‌గా మారడంతో.. దాన్ని తయారు చేసిన వ్యక్తిని పలువురు నెటిజన్లు మతిపోయిందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ వింత ఆహారానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం..Instagram లో thegreatindianfoodie అనే యూజర్ చేశారు. మ్యాగీతో ఇలాంటి ప్రయోగాలు చేయడం చూసి నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. మ్యాగీతో చేస్తున్న ఈ వింత వంటకం చూసి సోషల్ మీడియాలో జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం రోల్ రా నాయనా.. చూస్తుంటే వాంతి వచ్చేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
మ్యాగీ ఐస్ క్రీమ్ రోల్ వీడియో..
Also Read: