3 / 4
ధన్‌పాల్ అనే బస్సు డ్రైవర్ మొదట దీన్ని గుర్తించి పురావస్తు అధికారులకు సమాచారం అందించాడు. దాంతో పరిశోధకులు హొన్నెనహళ్లి గ్రామంలోని గోపాలకృష్ణ ఆలయంలో నల్ల రాతిపై ఈ శాసనాన్ని గుర్తించారు. తుళు భాషలో చెక్కిన ఈ శాసనమే..ఆయన మరణ సందేశం. దీని ద్వారా కృష్ణదేవరాయలు మరణించిన కచ్చితమైన తేదీ బయటకు వచ్చిందని డైరెక్టరేట్ ఆఫ్ ఎపిగ్రఫీ నిపుణులు ప్రకటించారు.