Election king: రికార్డుల్లోకి ఎక్కాలంటే గెలవాల్సిందేనా… ఓటమితోనూ రికార్డుల్లోకి ఎక్కొచ్చని నిరూపించాడు తమిళనాడుకు చెందిన పద్మరాజన్. ఈపేరుతో చెబితో ఇతన్ని గుర్తు పట్టడం కాస్త కష్టమే కావచ్చు కానీ.. ఎలక్షన్ కింగ్ అంటే మాత్రం కచ్చితంగా గుర్తుపడతారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఆయన నామినేషన్ ఉండాల్సిందే. 1988 నుంచి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పద్మరాజన్ నామినేషన్ వేస్తారు. ఓసారైతే ఏకంగా రాష్ట్రపతి ఎన్నికల్లోనూ నామినేషన్ వేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచినా, రాజ్యసభ, రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పద్మరాజన్ ఇప్పటి వరకు 218 సార్లు నామినేషన్లు వేశారు. అయితే వార్డు సభ్యుడిగా కూడా ఆయన ఇంత వరకు గెలవకపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీఎం పళనిస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్‌కు పోటీగా బరిలోకి దిగారు. దీంతో తాజాగా ఆయనకు ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. అయితే ఆ గుర్తింపు గెలిచినందుకు కాదు ఓడి నందుకు. అవును.. ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డు పద్మ రాజన్‌ను గుర్తించింది. తమ బుక్ ఆఫ్ రికార్డులో ఆయనకు చోటు కల్పిస్తూ సర్టిఫికెట్‌ను పంపించారు. గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కడమే తన లక్ష్యమని చెబుతున్నారు పద్మరాజన్.
Also Reaad: Egypt train Accident: ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు
Gangubai In OTT: మళ్లీ ఓటీటీ బాట పడుతోన్న సినిమాలు.. కరోనా ప్రభావమేనా.. గంగూబాయి కూడా..
Jagananna Vidya Deevena: నేడు ‘జగనన్న విద్యాదీవెన’ తొలివిడత సాయం.. తల్లుల ఖాతాల్లో జమ కానున్న నగదు..