Snakes: కళ్లు తెరచి.. కుంభకర్ణుడి నిద్రలోకి పాములు..! ఒకేచోట గుంపులుగా సుదీర్ఘ నిద్ర.. ఇలా ఎందుకంటే..

శీతాకాలంలో పాములు తక్కువగా కనిపిస్తాయి. దీని అర్థం ప్రమాదం వీటి వల్ల ప్రమాదం తక్కువగా ఉంటుందని కాదు. పాములు చలి నుంచి తప్పించుకోవడానికి సురక్షితమైన ప్రదేశం కోసం చూస్తాయి. ఈ కాలంలో వెచ్చదనం కోసం ఎక్కువగా ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. అప్పుడప్పుడు అవి వేటాడేందుకు మాత్రమే బయటకు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి..

Snakes: కళ్లు తెరచి.. కుంభకర్ణుడి నిద్రలోకి పాములు..! ఒకేచోట గుంపులుగా సుదీర్ఘ నిద్ర.. ఇలా ఎందుకంటే..
Warm Shelters For Snakes

Updated on: Oct 27, 2025 | 9:38 PM

భూమిపై అత్యంత విషపూరిత జంతువులలో పాములు ఒకటి. వాటిని చూస్తేనే చాలా మంది గజగజలాడిపోతారు. కానీ వేసవి, వర్షాకాలంలో ఇవి చాలా చోట్ల కనిపిస్తాయి. అయితే శీతాకాలంలో వాటి రూపం తగ్గుతుంది. కాబట్టి శీతాకాలంలో పాములు పెద్దగా కనిపించవు. శాస్త్రవేత్తల ప్రకారం, పాముల సంచారం పరిసర ఉష్ణోగ్రత, వాటి ఆహార లభ్యతపై ఆధారపడి ఉంటుంది. చాలా పాములు తీవ్రమైన చలిలో నిద్రాణ స్థితిలో ఉంటాయి.

పాములు శీతల రక్త జంతువులు. అంటే అవి తమ శరీర ఉష్ణోగ్రతను స్వయంగా నియంత్రించలేవు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వాటి శరీరాలు నీరసంగా మారుతాయి. అవి ఎక్కువ శక్తిని ఖర్చు చేయవు. ఈ సమయంలో అవి తమను తాము రక్షించుకోవడానికి బొరియలలో, రాళ్ల కింద లేదా చెట్ల వేళ్ళలో దాక్కుంటాయి. చలి కాలంలో పాములు వారాలు లేదా నెలల పాటు నిద్రపోతాయి. దీనిని నిద్రాణస్థితి అంటారు. వేసవి లేదా వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉన్నప్పుడు పాములు మరింత చురుకుగా ఉంటాయి. అవి పగటిపూట తక్కువగా, రాత్రిపూట ఎక్కువగా కదులుతాయి. ఎందుకంటే అవి వెచ్చని వాతావరణాన్ని ఇష్టపడతాయి.

పాములు కళ్ళు ఎప్పుడూ తెరిచి ఉండటం వల్ల నిద్రపోవని చాలా మంది అనుకుంటారు. కానీ పాములకు కనురెప్పలు ఉండవు. వాటి కళ్ళపై పారదర్శక పొర ఉంటుంది. అది దుమ్ము, గాయాల నుంచి కళ్లను రక్షిస్తుంది. అందుకే పాములు నిద్రపోతున్నప్పుడు కూడా వాటి కళ్ళు తెరిచి ఉంటాయి. పాములకు కూడా నిద్రాణస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా కనుగొన్నారు. అవి నిద్రపోయినప్పుడు వాటి శ్వాస నెమ్మదిస్తుంది. వాటి శరీరం పూర్తిగా నిశ్చలంగా ఉంటుంది. అవి ఏ శబ్దం లేదా కదలికకు వెంటనే స్పందించవు. వాతావరణాన్ని బట్టి పాముల నిద్రాణస్థితి మారుతుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా, పగటిపూట సూర్యరశ్మిని నివారించడానికి పాములు బొరియలలో ఉండి రాత్రిపూట బయటకు వస్తాయి. ఈ సమయంలో అవి 10 నుంచి 12 గంటలు విశ్రాంతి తీసుకుంటాయి. వర్షాకాలంలో తేమ, చలి కారణంగా అవి పగటిపూట కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాయి. రాత్రిపూట మరింత చురుకుగా ఉంటాయి. శీతాకాలంలో, ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల పాములు పూర్తిగా నిష్క్రియాత్మకంగా మారతాయి. అవి 2 నుంచి 3 నెలలు లేదా కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కాలం తినకుండా, తాగకుండా నిద్రపోతాయి. ఇది వాటి నిజమైన నిద్ర కాలం.

ఇవి కూడా చదవండి

నిద్రాణస్థితిలోకి వెళ్లే ముందు పాములు లోతైన చోట, పాత బొరియలు, భూగర్భంలో వెచ్చని ప్రదేశానికి వెళతాయి. అక్కడ అవి పర్యావరణానికి అనుగుణంగా తమ శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. తద్వారా అవి తక్కువ శక్తిని ఉపయోగించుకోగలవు. ఈ సమయంలో వాటి జీర్ణవ్యవస్థ, హృదయ స్పందన రేటు చాలా నెమ్మదిస్తుంది. ఈ కాలంలో పాములు వెచ్చగా ఉండటానికి ఎక్కువ సమక్యలో ఒకే చోట కలిసి నిద్రపోతాయి. వాతావరణం మారి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అవి మళ్ళీ బయటకు వచ్చి చురుకుగా మారుతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.