పెళ్లి చేయమని ఏకంగా సీఎంనే కలిసాడు.. పోలీసులకు పిల్లను చూడమని చెప్పాడు.. చివరకు ఏమైందంటే..?

Azeem Mansuri Marriage Proposals : ఐదేళ్లుగా పెళ్లికోసం చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో చివరకు పోలీస్‌ స్టేషన్ వెళ్లి పెళ్లి కూతురిని

పెళ్లి చేయమని ఏకంగా సీఎంనే కలిసాడు.. పోలీసులకు పిల్లను చూడమని చెప్పాడు.. చివరకు ఏమైందంటే..?
Azeem Mansuri

Updated on: Apr 03, 2021 | 6:38 PM

Azeem Mansuri Marriage Proposals : ఐదేళ్లుగా పెళ్లికోసం చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో చివరకు పోలీస్‌ స్టేషన్ వెళ్లి పెళ్లి కూతురిని వెతికిపెట్టాలని కోరుకున్నాడు ఓ మరుగుజ్జు వ్యక్తి.. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన అజీమ్ మన్సూరి పుట్టుకతోనే మరుగుజ్జు.. అతడి వయసు 26 సంవత్సరాలు.. పొడవు కేవలం రెండున్నర అడుగులు. వస్త్రం వ్యాపారం చేసే అతడు పెళ్లికోసం ఐదుళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. చాలా సంబంధాలు వచ్చినట్టే వచ్చి వెళ్లిపోతున్నాయి.. దీనికి కారణం అతడి హైటే.. దీంతో అతడు పోలీసులను కలిసిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఇప్పుడు సంబంధాలు అతడిని వెతుక్కుంటూ వస్తున్నాయి. అతడి కథను ఒక్కసారి తెలుసుకుందాం..

ఐదో తరగతి చదువుకున్న అజీమ్ వస్త్ర వ్యాపారం ద్వారా బాగానే సంపాదించాడు. సొంత ఇళ్లు కూడా ఉంది.. 21 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులు పెళ్లి చూపులు మొదలు పెట్టారు. కానీ, ఐదేళ్లయినా పెళ్లి కుదరడం లేదు. కారణం, అతడి హైటే. మరుగుజ్జు కావడంతో అతడిని పెళ్లి చేసుకునేందుకు ఏ అమ్మాయి కూడా ఇష్టపడ లేదు. దీంతో అతడు పెళ్లి చేయాలంటూ ఏకంగా అప్పటి యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ కు 2019లో లేఖ కూడా రాశాడు.

ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం తనకు పెళ్లి కూతురిని వెతికి పెట్టి, పెళ్లి చేయండంటూ పోలీసులను విన్నవించుకున్నాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అజీమ్.. పబ్లిక్ సర్వీస్ లో భాగంగా తనకు ఈ ఒక్క సాయం చేసి పుణ్యం కట్టుకోండి ప్లీజ్ అంటూ పోలీసుల గడ్డం పట్టుకుని వేడుకున్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే.. అజీమ్ ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చాక అతడి ఫేట్ మారింది. ఇప్పుడు పెళ్లి సంబంధాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. తన సుదీర్ఘ నిరీక్షణ ఫలించడంతో అజీమ్ ఆనందంలో మునిగిపోయాడు.

పలు పెళ్లి సంబంధాలు రాగా అందులో ఘజియాబాద్ కి చెందిన 25ఏళ్ల రెహనా అన్సారి.. మనోడికి బాగా నచ్చిందట. ఇక ఢిల్లీ నుంచి మరో యువతి పెళ్లి ప్రపోజల్ పెట్టింది. నువ్వు సింగిల్, నేను సింగిల్.. ఇద్దరమూ ఒక్కటవుదామా అని అడిగింది. హపూర్, సహరన్ పూర్, మొరాదాబాద్ నగరాల నుంచి పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయని అజీమ్ కుటుంబసభ్యులు చెప్పారు. ఇదంతా దేవుడి దయ అని, త్వరలోనే తన పెళ్లి అవుతుందని అజీమ్ ఆనందంగా చెప్పాడు.

Attempt To Break ATM: గచ్చిబౌలిలో ఏటీఎమ్‌ చోరీకి యత్నించిన ఆగంతకుడు.. ఫొటోలు షేర్‌ చేసిన పోలీసులు..

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు మృతి.. 12 మంది భద్రతా సిబ్బందికి గాయాలు

TN Elections 2021: తమిళనాట కమల్ హాసన్ కింగ్ మేకర్ అవుతారా? MNM పార్టీతో ఏ పార్టీకి నష్టం?