బ్రేకింగ్: నిర్బయ దోషుల ఉరి ఇప్పట్లో లేనట్లే!

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నిర్భయ కేసు దోషుల ఉరితీత ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దోషులకు వున్న అన్ని న్యాయ అవకాశాలను నిర్ణీత గడువులోగా వినియోగించుకోవాలని కోర్టులు ఆదేశాలివ్వలేవని, అలా చేస్తే అది వారి పౌరహక్కులకు భంగం కలిగించినట్లే అవుతుందని ఇవాళ సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. నలుగురు నిందితుల్లో ఒకడైన పవన్ గుప్తా తనకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవడం లేదని, తద్వారా దోషులు జాతి సహనాన్ని పరీక్షిస్తున్నారని సొలిసిటర్ జనరల్ శుక్రవారం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. […]

బ్రేకింగ్: నిర్బయ దోషుల ఉరి ఇప్పట్లో లేనట్లే!
Follow us

|

Updated on: Feb 07, 2020 | 1:59 PM

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నిర్భయ కేసు దోషుల ఉరితీత ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దోషులకు వున్న అన్ని న్యాయ అవకాశాలను నిర్ణీత గడువులోగా వినియోగించుకోవాలని కోర్టులు ఆదేశాలివ్వలేవని, అలా చేస్తే అది వారి పౌరహక్కులకు భంగం కలిగించినట్లే అవుతుందని ఇవాళ సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. నలుగురు నిందితుల్లో ఒకడైన పవన్ గుప్తా తనకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవడం లేదని, తద్వారా దోషులు జాతి సహనాన్ని పరీక్షిస్తున్నారని సొలిసిటర్ జనరల్ శుక్రవారం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. దోషులకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలను వారం రోజుల్లో వినియోగించుకునేలా నోటీసులు జారీ చేయాలని సొలిసిటర్ జనరల్ కోర్టును కోరారు. ఆయన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

నిర్భయ దోషులను విడివిడిగా ఉరి తీయాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్నిసుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మసనం శుక్రవారం విచారించింది. నిర్భయ దోషులు జాతి సహనాన్ని పరీక్షిస్తున్నారని కోర్టుకు తెలిపిన సోలిసిటర్ జనరల్.. దోషుల న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునే వరకు ఉరిశిక్ష అమలు చేయలేమని అధికారులు చెప్తున్నారని సుప్రీం బెంచ్‌కు వివరించారు. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా రివ్యూ పిటిషన్‌ని 2018లో సుప్రీంకోర్టు కొట్టేసినప్పటి నుంచి ఇప్పటివరకు తనకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేదని సోలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.

హైకోర్టు ఇచ్చిన వారం రోజుల గడువులోపు దోషులకు ఉన్న అవకాశాలను వినియోగించుకునేల నోటీసులు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. ఆయన అభ్యర్థన మేరకు నోటీసులు ఇవ్వడానికి ధర్మాసనం అంగీకరించలేదు. న్యాయ అవకాశాలను ఉపయోగించుకోవాలని ఏ ఒక్కరు ఒత్తిడి చేయలేరని బెంచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జస్టిస్ భూషణ్ అన్నారు. తదుపరి విచారణను ఫిబ్రవరి11 మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది త్రిసభ్య ధర్మాసనం.

దోషులను ఒకేసారి ఉరితీయాలన్న నిర్ణయం నేపథ్యంలో పవన్ గుప్తాకు ఇంకా పలు అవకాశాలు మిగిలే వున్నాయి. రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం, క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేయడం వంటి అవకాశాలు దోషుల్లో ఒకరికి మిగిలే వున్న నేపథ్యంలో మిగిలిన ముగ్గురి ఉరిశిక్షను కూడా అమలు చేయలేని పరిస్థితి నెలకొంది. పవన్ గుప్తా గనక తనకున్న న్యాయపరమైన అవకాశాలను ఇప్పట్లో వినియోగించుకోకపోతే.. వారి ఉరి శిక్ష అమలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు.

ఒక్క పవన్ గుప్తా కారణంగా మిగిలిన వారి ఉరి అమలు కూడా నిరవధికంగా వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోందని న్యాయనిఫుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతటి పెద్ద శిక్ష పడినా దాని అమలుకు ఇన్ని న్యాయపరమైన చిక్కులుంటే దోషులకు వెసులుబాటు దొరుకుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో