Kisan Panchayat: కిసాన్‌ పంచాయత్లకు సుప్రీంకోర్టు చీవాట్లు

|

Oct 01, 2021 | 12:24 PM

కిసాన్‌ పంచాయత్లకు చీవాట్లు పెట్టింది సుప్రీంకోర్ట్‌. జాతీయ రహదారులను నిర్బంధించి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది

Kisan Panchayat: కిసాన్‌ పంచాయత్లకు సుప్రీంకోర్టు చీవాట్లు
Kisan Panchayat
Follow us on

Supreme Court pulls up Kisan Panchayat: కిసాన్‌ పంచాయత్లకు చీవాట్లు పెట్టింది సుప్రీంకోర్ట్‌. జాతీయ రహదారులను నిర్బంధించి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును ఆశ్రయించినప్పుడు నిరసన చేపట్టడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. నిరసన తెలిపే హక్కు రైతులకు కచ్చితంగా ఉంది.. కానీ రహదారులను నిర్బంధించడం సరికాదని పేర్కొంది. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా కోరుతూ కిసాన్‌ మహా పంచాయత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం.

ఐతే తాము రహదారులపై బైఠాయించిన రైతుల ధర్నాలో భాగం కాదని కోర్టుకు తెలిపింది కిసాన్‌ మహా పంచాయత్‌. జంతర్‌ మంతర్‌ వద్ద తాము సత్యాగ్రహం తెలుపుతామని వెల్లడించింది.  కిసాన్‌ పంచాయత్‌ వ్యాఖ్యలపై స్పందించిన ధర్మాసనం.. ముందు మీరు రైతుల ధర్నాలో భాగం కాదంటూ రాతపూర్వకంగా అఫిడవిట్‌ దాఖలుచేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా, దేశంలో కొత్తగా మరో 6 మంది న్యాయమూర్తుల నియామకం జరగనుంది. సుప్రీంకోర్టు కొలీజియం 16 మంది పేర్లను సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా దేశంలోని నాలుగు హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామక ప్రక్రియ పూర్తి కానుంది. ముంబాయి, గుజరాత్, ఒడిశా, పంజాబ్-హర్యానా హైకోర్టుల కోసం ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం 16 మంది పేర్లను సూచించింది. వీరిలో ఆరుగురు జ్యుడీషియల్ అధికారులైతే మరో పదిమంది న్యాయవాదులున్నారు.

Read also: Huzurabad: హుజురాబాద్ అభ్యర్థికి బీ ఫారంతోపాటు, ఎన్నికల ఖర్చుకు టీఆర్ఎస్ పార్టీ ఎంతిచ్చిందో తెలుసా..?