Vaccination: మీ దగ్గరలో వ్యాక్సినేషన్‌ సెంటర్‌ ఎక్కడుందో తెలియడం లేదా..? ఇలా వాట్సాప్‌ ద్వారా సులభంగా తెలుసుకోండి

|

May 22, 2021 | 7:16 PM

Vaccination Registration: దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా..

Vaccination: మీ దగ్గరలో వ్యాక్సినేషన్‌ సెంటర్‌ ఎక్కడుందో తెలియడం లేదా..? ఇలా వాట్సాప్‌ ద్వారా సులభంగా తెలుసుకోండి
Follow us on

Vaccination Registration: దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇక మే 1 నుంచి 18 ఏళ్లపైబడిన వారికి కూడా వ్యాక్సిన్‌ వేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఆయా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ సెంటర్లు తెలియక కొందరు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే వ్యాక్సినేషన్ సెంటర్స్ వివరాలు ఎలా తెలుసుకోవాలి..? ఎలా నమోదు చేసుకోవాలనేది చాలామందికి తెలియడం లేదు.. అయితే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. మీరు ఉన్న ప్రాంతం నుంచే మీకు దగ్గరలోఉన్న వ్యాక్సినేషన్‌ సెంటర్‌ల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. అది కూడా ఉచితంగానే. వ్యాక్సిన్‌కు రిజిస్ట్రేషన్‌కు మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ముందుగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కూడా ఏప్రిల్‌ 28 నుంచే ప్రారంభించింది. వ్యాక్సిన్‌ నమోదుకు మీ ఇంటికి దగ్గరలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ సెంటర్ల వివరాలు చాలా సులభంగా మీ స్మార్ట్ ఫోన్ లోని వాట్సాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

ముందుగా మీ వాట్సప్‌లోని కరోనా హెల్ప్‌ డెస్క్‌ అయిన MYGOVలో ద్వారా మీకు దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్‌ సెంటర్ల వివరాలు తెలుసుకోవచ్చు. అందుకు ముందుగా మీరు మీ వాట్సాప్‌ మొబైల్‌ ద్వారా మీరు ఉండే ప్రాంతం పిడ్‌కోడ్‌ నెంబర్‌ను టైప్‌ చేసి 9013151515 నంబర్‌కు మెసేజ్ సెండ్ చేయాలి. అప్పుడు మీకు ఆటోమెటిక్‌గా మీకు దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్‌ సెంటర్ల లొకేషన్‌ను చూపిస్తుంది. అప్పుడు మీకు అందుబాటులో ఉన్న టీకా సెంటర్‌ను ఎంచుకొని టీకా తీసుకోవచ్చు.
దీంట్లో సెంటర్‌ వివరాలతో పాటు, రిజిస్ట్రేషన్‌ నమోదుకు లింక్‌ కోవిన్‌ ద్వారా చేసుకోవాలి.
ఈ విధంగా చేసుకున్నట్లయితే సులభంగా మీరు ఉండే ప్రాంతంలో టీకా కేంద్రాన్ని తెలుసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

ఇవీ కూడా చదవండి:

Mega Oxygen Tankers: దేశంలో ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు ‘మేఘా’ సంస్థ మహా యజ్ఞం.. థాయిలాండ్‌ నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లు

Oxygen: థాయిలాండ్‌ నుంచి భారత్‌కు 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు.. ఉచితంగా అందించనున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ