AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్ వ్యాప్తికి తబ్లీఘీ జమాత్ సభ్యులే కారణం.. యోగి ఆదిత్యనాథ్ నిప్పులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి తబ్లీఘీ జమాత్ సభ్యులే కారణమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. వైరస్ ని ఇన్ఫెక్ట్  చేయడం నేరమేమీ కాదని, కానీ దాన్ని దాచిపెట్టడం పెద్ద నేరమని ఆయన అన్నారు. ఈ నేరానికి గాను వారిపై చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

కరోనా వైరస్ వ్యాప్తికి తబ్లీఘీ జమాత్ సభ్యులే కారణం.. యోగి ఆదిత్యనాథ్ నిప్పులు
Umakanth Rao
| Edited By: |

Updated on: May 03, 2020 | 6:14 PM

Share

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి తబ్లీఘీ జమాత్ సభ్యులే కారణమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. వైరస్ ని ఇన్ఫెక్ట్  చేయడం నేరమేమీ కాదని, కానీ దాన్ని దాచిపెట్టడం పెద్ద నేరమని ఆయన అన్నారు. ఈ నేరానికి గాను వారిపై చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆ సంస్థ సభ్యుల నిర్వాకాన్ని ఖండించి తీరాల్సిందే అని పేర్కొన్నారు. ఒక వ్యాధి వస్తే అది నేరం కాబోదు. కానీ దాన్ని దాచి పెట్టడం నేరమే అవుతుంది.. ఈ నేరానికి ఈ సంస్థ వాళ్ళే కారకులయ్యారు అని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. యూపీలో గానీ, మరెక్కడైనా గానీ కరోనా వ్యాప్తి వెనుక ఈ సంస్థే ఉందన్నారు. వారు దీన్ని దాచిపెట్టకపోయినా, దీని క్యారియర్లు కాక పోయినా కరోనాను చాలావరకు కంట్రోల్ చేయగలిగి ఉండేవారమని యోగి ఆదిత్య నాథ్ చెప్పారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పలు సందర్భాల్లో ఇదే ఆరోపణలు చేయడం తెలిసిందే.

Follow Us