ఇన్ని నెలల సస్పెన్స్ అనంతరం కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప రాజీనామా చేశారు. ఇక కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది తెలియాల్సి ఉంది. తన రాజీనామా గురించి సోమవారం ఆయన ప్రకటిస్తున్నప్పుడు భావోద్వేగంతో కంట తడి పెట్టారు. తాను బీజేపీని వీడడం లేదని, పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని అన్నారు. ప్రజలకు ఇన్నేళ్లు సేవ చేసేందుకు తనకు అవకాశమిచ్చిన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. నన్ను రాజీనామా చేయమని ఎవరూ ఒత్తిడి చేయలేదు.. నేనే చేస్తున్నా…వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఈ ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తా అని ఆయన చెప్పారు. ఇక కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు బీజేపీ కర్ణాటకకు పరిశీలకుల (అబ్జర్వర్ టీమ్) బృందాన్ని పంపాలని నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో ఈ బృందం బెంగుళూరు చేరుకోనుంది.పార్టీ లెజిస్లేచర్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కొత్త వారసుని సెలెక్ట్ చేయాల్సి ఉంది. బహుశా ఈ వారాంతంలోగా ఈ ప్రక్రియ పూర్తి కావచ్చునని భావిస్తున్నారు. అంతవరకు ఎడ్యూరప్ప ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వాన పరిశీలకుల బృందం నగరానికి రానున్నట్టు తెలుస్తోంది. ఇక తన రాజీనామాను గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కి సమర్పించిన అనంతరం ఎడ్యూరప్ప..తన 50 ఏళ్ళ పొలిటికల్ కెరీర్ లో ప్రజలకు సేవ చేయవలసి రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. బీజేపీకి తాను విశ్వాస పాత్రుడిగా ఉంటానన్నారు. తనను సమర్థించిన లింగాయత్ లకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ… కొత్త ముఖ్యమంత్రికి కూడా మీరు ఇలాగే మద్దతునివ్వాలని కోరారు. అటు రాష్ట్రంలో అవినీతికర ప్రభుత్వం గద్దె దిగడం సంతోషకరమని ఎడ్యూరప్ప వ్యతిరేక వర్గం పేర్కొంది. ఆయన ఇద్దరు కొడుకులూ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వచ్చారని, ఇక వారి ఆటలు చెల్లు అని ఈ వర్గం వ్యాఖ్యానించింది.
మరిన్ని ఇక్కడ చూడండి : రెండు డోసులతోనే డెల్టా కు చెక్..!రానున్న మరో ప్రమాదకరమైన మూడు వేరియంట్లు..:Control Delta with two doses Video.